కరోనా దెబ్బకు ఇప్పుడు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలు ఎవరూ కూడా అవసరం అయితే మినహా బయటకు రాకుండా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కరోనా వైరస్ దేశంలో అదుపులో ఉండాలి అంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాల్సిన అవసరం అనేది ఉంది. కాని కొంత మంది మాత్రం స్వేచ్చగా తిరిగే పరిస్థితి ఉంది. ఇది పక్కన పెడితే కరోనా వైరస్ దెబ్బ మావోయిస్ట్ లకు భారీగా తగిలింది అంటున్నారు నిపుణులు. వాళ్లకు కరోనాకు సంబంధం ఏంటీ అంటారా...? 

 

ఏమీ లేదండి కరోనా వైరస్ కట్టడి కోసం మన దేశంలో లాక్ డౌన్ ని ప్రకటించాయి కదా ప్రభుత్వాలు. ఈ నేపధ్యంలో వాళ్లకు తినడానికి తిండి దొరకడం లేదు. కూరగాయలు కొనుక్కునే పరిస్థితి లేదు. సరుకులు కొనుక్కునే పరిస్థితి అసలు లేదు. గతంలో అంటే అడవుల నుంచి బయటకు వచ్చి స్వేచ్చగా కొనుగోలు చేసే వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బయటకు వస్తే అవసరం అయితే ఆధార్ కార్డ్ కూడా చూపించాల్సిన పరిస్థితి దేశంలో నెలకొంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవరూ కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

 

తాజాగా ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో గ్రామాల్లో ఉన్న సర్పంచ్ లను మావోలు బెదిరిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కువగా మావోలు ఉన్నారు. వారికి అటవీ ప్రాంతం ప్రధాన బలంగా ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ నేపధ్యంలో సరుకులు అసలు దొరకడం లేదు. తాజాగా కందిపప్పు కోసం ఒక గ్రామ సర్పంచ్ ని మావోలు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తుంది. తమకు కచ్చితంగా సరుకులు అందించాలని లేకపోతే చంపేస్తామని వారు బెదిరించారని పోలీసులకు సమాచారం అందింది. దీనితో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: