ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మరో రెండు కేసులు నమోదు కావడంతో బాధితుల సంఖ్య 21కు చేరింది. రాష్ట్రంలో ఈరోజు 102 నమూనాలను పరిశీలించారు. వీరిలో ఇద్దరికి మాత్రం పాజిటివ్ అని తేలింది. ఇటీవల యూకే నుంచి వైజాగ్ వచ్చిన పేషెంట్ ను కలిసిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. 


 
ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. ఈరోజు నమోదైన రెండు కేసులు విశాఖలోనే నమోదు కావడం గమనార్హం. ఇప్పటివరకూ రాష్ట్రంలో విశాఖ జిల్లాలో అత్యధికంగా 6 కేసులు నమోదయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలలో 4 కేసులు నమోదు కాగా ప్రకాశం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. నెల్లూరు, తూర్పు గోదావరి, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. 


 
ఈరోజు నమోదైన ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. వైద్య, ఆరోగ్య శాఖ విశాఖ, నెల్లూరు జిల్లాలకు చెందిన ఇద్దరు కరోనా బాధితులు కోలుకున్నారని ప్రకటన చేసింది. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి, అతని సిబ్బందికి పరీక్షలు జరపగా వారికి కరోనా నెగిటివ్ అని తేలింది. రాష్ట్రంలో ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 


 
ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. ఈ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పట్టణాల్లో ఉదయం 11 గంటల వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది. గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: