దక్షిణ భారతదేశంలో కరోనా వైరస్ ని బాగా అరికడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వారికి ఉండటంతో వాళ్లను గుర్తించడంలో దేశంలో మిగతా ప్రభుత్వాల కంటే ఏపీ ప్రభుత్వం చాలా అలర్ట్ గా ఉందని జాతీయస్థాయిలో ఏపీ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్ పరిపాలనలో ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పనితనం చాలా అద్భుతం అని కథనాలు ప్రసారం చేస్తున్నారు. ఇదే తరుణంలో కేరళ ప్రభుత్వం కూడా జగన్ ఐడియా ని ఫాలో అవుతూ...త్వరలోనే గ్రామ వాలంటీర్ల వ్యవస్థను పరిపాలనలోకి తీసుకు రావడానికి రెడీ అవుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ కట్టడి చర్యలు చేపడుతున్న వైయస్ జగన్ తన పార్టీలో ఒక నాయకుడు చేసిన పనికి, శభాష్ అంటూ మెచ్చుకున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి.

 

పూర్తి మేటర్ లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన షట్ డౌన్ కార్యక్రమం పకడ్బందీగా రాష్ట్రంలో అమలు కావడానికి అన్ని విధాల చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి నిత్యావసర సరుకులకు ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అనేక విధాలుగా చర్యలు చేపట్టడం జరిగింది. గ్రామాల్లో మరియు పట్టణాలలో బ్లీచింగ్ ను స్ప్రే చేస్తూ వైరస్ వ్యాపించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

 

తాజాగా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి ramakrishna REDDY' target='_blank' title='రామకృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామకృష్ణారెడ్డి కూడా మున్సిపల్ సిబ్బందిలో జోష్ ను పెంచడానికి ఆయన కూడా క్లోరిన్ మందు స్ప్రే చేశారు. మాచర్ల పట్టణం వీధుల్లో క్లోరిన్ మందు స్ప్రే చేసిన పిన్నెల్లి.. ఈ సందర్భంగా ప్రజలెవరూ బయటకి రావద్దని లాక్ డౌన్ ను తప్పని సరిగా పాటించాలని కోరారు. దీంతో ఈ విషయం పార్టీ లో వైరల్ కావడంతో వెంటనే వైయస్ జగన్ రామకృష్ణ రెడ్డి కి ఫోన్ చేసి  "శభాష్ .. నీలాంటి నాయకుడే కావాలి " అని మెచ్చుకున్నారని వైసీపీ పార్టీలో టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: