వరల్డ్ వైడ్ గా కరోనా వైరస్ మనుషులను భయబ్రాంతులకు గురి చేసి ఇంటికి పరిమితం చేసింది. ఈ వైరస్ ని ఎదుర్కోవటానికి అభివృద్ధి చెందిన దేశాలు మా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేశాయి. అగ్రరాజ్యం అని ప్రపంచ దేశాలతో పిలిపించుకున్న అమెరికా కూడా ఈ వైరస్ వల్ల చాలా వరకు నష్టపోయింది. ఆర్థికంగా గాను మరియు అనేక విధాలుగా అమెరికా దేశం మరియు ఇటలీ అదేవిధంగా స్పెయిన్ దేశాలు పరిస్థితి చాలా దారుణంగా నష్టపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ పూర్తిగా వ్యాప్తి చెందకుండా ఇండియాలో కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు షట్ డౌన్ ప్రకటించడం జరిగింది.

 

దీంతో దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలను ఇంటి నుండి బయటకు రానివ్వకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి, ఎవరూ కూడా ఊరి పొలిమేరలు దాటకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎక్కడి ప్రజలను అక్కడే ఉండేవిధంగా చర్యలు తీసుకున్నారు. కేవలం నిత్యావసర సరుకులు అదేవిధంగా కూరగాయలు, మెడిసిన్ షాపులకు మాత్రమే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మందుబాబులు ఇప్పుడు విలవిలలాడి పోతున్నారు. పొద్దున రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు అయినా బార్ షాపులు ఓపెన్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

 

ఇదిలా ఉండగా పల్లెటూర్లలో మందుకు బానిసైన వాళ్ళు అత‌లాకుత‌లం అయిపోతున్నారు. అదేవిధంగా కొంతమంది కల్లు కోసం ఆగమాగమైపోతున్నారు. కరోనాతో చచ్చిపోయినా ఫర్వాలేదు.. కానీ మాకు కల్లు కావాలంటూ బతిమాలుకుంటున్నారు. చాలామంది ఇళ్లల్లో భార్యలను కొట్టేసి పిచ్చి పిచ్చిగా మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు. షట్ డౌన్ చాలా మంది కుటుంబ జీవితాలలో గొడవలు సృష్టిస్తుందని ఇండియా పాలిట శాపంగా మారిందని...చాలా మంది విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: