కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై బాగా చూపుతోంది. ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఆర్థిక రంగంలో ప్రపంచ వ్యాప్తంగా చైనా దూసుకుపోతున్న ట్లు తీవ్రంగా అమెరికా నష్టపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక రంగంలో మొదటి పది బ్యాంకులలో చైనా కి నాలుగు బ్యాంకులు ఉన్నట్లు ఎప్పుడు మొదటి ఉండే అమెరికా ఇప్పుడు తాజాగా రెండు బ్యాంకులకు పడిపోయినట్లు...దీంతో ఇది కుట్రపూరితంగా చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరిపాలించడానికి కరోనా వైరస్ అనే మహమ్మారిని ప్రపంచం మీద వదిలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా కరోనా వైరస్ అరికట్టడానికి ఇండియాలో లాక్ డౌన్ ప్రకటించడంతో సోమవారం స్టాక్ మార్కెట్లు మొత్తం అన్ని కుప్పకూలాయి.

 

దీంతో ఎటువంటి క్లిష్టమైన సమయంలో మార్కెట్ ఓపెనింగ్ లో తాజాగా ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపడంతో భారీ నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ 2400 పాయింట్ల నష్టాలలో జారుకోవడంతో మార్కెట్లను 45 నిమిషాల పాటు ఆపివేశారు. వైరస్ ప్రభావం ఎక్కువకాలం కొనసాగుతుందన్న అంచనాలతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దేశంలో ఉన్న కొద్ది పరిస్థితి తీవ్రతరం అవుతున్న తరుణంలో సెన్సెక్స్ 3934 పాయింట్ల నష్టంతో 25981 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 1136 పాయింట్ల నష్టంతో 7610 వద్ద ముగిసింది.

 

ఇక ఎప్పుడు లేనంతగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవడంతో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే 13.88 లక్షల కోట్ల ఆవిరై అట్టర్ ఫ్లాప్ దిశగా భారత్ ఎకానమీ కుప్పకూలిపోయింది. రానున్న రోజుల్లో భారత ఆర్థిక రంగం నిలబడాలంటే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలని...అది సామాన్యుల పేదవాళ్ల జీవితాలపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితులు భారత ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటాయని చాలామంది నిపుణులు మరొకపక్క చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: