ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ విజృంభణను అడ్డుకునేందుకు ప్రపంచంలోని వివిధ దేశాలు వివిధ మార్గాలను అనుసరిస్తున్నాయి. ఒక్కో దేశానిది ఒక్కో పంథా.. ఇక కరోనాతో కుదేలవుతున్న మన పొరుగు దేశం పాకిస్తాన్ కరోనా పై పోరాటానికి సైన్యాన్ని రంగంలోకి దించేసింది. దేశమంతటా సైనిక బలగాలను రంగంలోకి దింపి ప్రజలకు సాయం చేయాలని ఆదేశించింది.

 

 

పాక్ సైనిక బలగాలు ఆక్రమిత కాశ్మీర్ సహా పాక్‌లోని నలుమూలలకు వెళ్లాయి. ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన కరోనా వ్యాప్తి నివారణ ఆపరేషన్‌లో సైనిక బలగాలు పాల్గొంటాయి. ఈ సైనిక బలగాల మోహరింపును ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా ధ్రువీకరించారు. ఇప్పటికే కరోనా కట్టడి లో సాయం చేయాలంటూ ప్రభుత్వంలోని అనేక శాఖలు సైన్యాన్ని రెండు మూడు రోజులుగా కోరుతున్నాయి.

 

 

కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఇండియా తరహాలోనే పాకిస్తాన్ సైతం దేశమంతటా లాక్‌ డౌన్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఆసుపత్రులు, మందుల షాపులు, నిత్యావసరాలు, ఆహారం, ఔషధాల తయారీ పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన అన్నింటినీ మూసేశారు.

 

 

ఇప్పటి వరకూ పాకిస్తాన్‌లో దాదాపు 1200 మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్థరణ అయ్యింది. వీరిలో ఇప్పటి వరకూ 12 మంది వరకూ మృత్యువాత పడ్డారు. మరో 25 మంది ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. కరోనా కట్టడి కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పాటు సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇప్పుడు సైన్యం రంగంలోకి దిగింది. ప్రజలకు సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: