కరోనా పై ఉన్న అనేక భయాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ వైద్య సేవలు స్తంభించాయి. ముఖ్యంగా కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోజుకి కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. చిన్నసైజు హాస్పిటల్ లోనే లక్షల రూపాయలు చేతులు మారుతూ ఉండగా.. ఇక పెద్ద సైజు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో అయితే కేవలం వారి ఒక్కరోజు ఆదాయమే లక్షల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు అనేక అత్యవసరమైన ఆపరేషన్లు వాయిదా పడ్డాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్ పేషెంట్ల నెంబర్ సగానికి తగ్గిపోయింది. ఇక .పి లు అయితే దాదాపు 80 శాతం వరకు తగ్గిపోయాయి. రీరి బాగుండకపోతే తప్పించి ఎవరూ ఆస్పత్రికి వెళ్లడం లేదు.

 

ప్రస్తుతం దాదాపు చాలా మంది చిన్న వ్యాధి వచ్చినా ఆస్పత్రికి వెళ్లే వారు కూడా కరోనా దెబ్బకు కార్పొరేట్ ఆస్పత్రుల వైపు చూడడం మానేశారు. ఏదో ఒక మెడికల్ షాప్ కి వెళ్లి తమ వ్యాధి లక్షణాలను చెప్పి మందులు తెచ్చుకుంటున్నారే తప్ప ఎవరూ ఆస్పత్రికి వెళ్లడం లేదు. అక్కడికి వెళ్ళి ఎవరైనా కరోనా పేషెంట్ టెస్టుల కోసం వచ్చి తమకు ఏమైనా జరిగితే.... ఎందుకు రిస్క్ అని భావనలో అందరూ ఉన్నారు.

 

సాధారణ జ్వరం, జలుబు కి కూడా ఎటువంటి హడావుడి పడకుండా ఇంటి వద్దనే మందులు వేసుకుంటూ వేచి చూసే ధోరణికి ప్రజలు వచ్చేశారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ఇప్పుడు ఇది చాలా ఇబ్బందికరంగా మారింది అదీ కాకకార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసే చాలామంది స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.

 

అంటే ఇప్పటి వరకూ అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల్ని భయపెట్టి కార్పొరేట్ ఆస్పత్రులు ఎలా దోచుకున్నాయో, ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులుంటే చాలు, వారిని ఎలా ఐసీయూలకి తరలించారో అర్థమవుతోంది. ఆస్పత్రుల్లో మోసం జరక్కపోతే.. గతంలోలాగే ఇప్పుడు కూడా రోగులు వైద్య సేవల కోసం హడావిడి పడాల్సి వచ్చేది కదా, పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఒక రకంగా కరోనా ప్రజల ఆలోచనా ధోరణిని కూడా కొంతవరకు మార్చగలిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: