దక్షిణ అమెరికా దేశాల్లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. అన్ని దేశాల్లో ఇప్పుడు ఇది ప్రభావం చూపిస్తుంది. దీన్ని కట్టడి చేయలేక అక్కడి దేశాలు దాదాపుగా చేతులు ఎత్తేసిన పరిస్థితి కనపడుతుంది. యూరప్ దేశాల్లో కరోనా వైరస్ విస్తరిస్తుంది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో పరిస్థితులు మరీ దిగజారుతున్నాయి అనే అర్ధమవుతుంది. జర్మనీ లో కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తుంది. ఆర్ధిక పరిస్థితి మరింతగా దిగజారి పోయే పరిస్థితి ఏర్పడింది. 

 

దీనితో జర్మని ఆర్ధిక మంత్రి ఆత్మహత్య చేసుకున్నారు. జర్మనీలోని హెస్సే రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్ షఫెర్ ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా లాక్ డౌన్ దెబ్బకు జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్ప కూలిపోయింది. దీనితో తన రాష్ట్రంలో పరిస్థితి మరీ దిగజారిపోవడం తో ఆయన ఒత్తిడికి గురయ్యారు. హొచీమ్ పట్టణంలో ఆయన మృతదేహాన్ని హై స్పీడ్ రైల్వే లైన్‌ పై గుర్తించారు. 

 

రైల్వే ట్రాక్‌ పై డెడ్ బాడీని గుర్తించిన పారామెడికల్ సిబ్బంది పోలీసులుకు సమాచారం అందించారు. తర్వాత మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు చనిపోయింది మంత్రి అని గుర్తించారు. గత రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ఆయన్న దాదాపు పదేళ్లుగా ఆర్థిక మంత్రిగా పని చేస్తున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన క్రిస్టియన్ డెమొక్రాట్స్ పార్టీ నాయకుడు ఆయన.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: