కేరళ మహారాష్ట్ర పరిస్థితి ఏంటీ...? అక్కడ కేసులు క్రమంగా పెరగడంతో ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఈ ప్రశ్న వినపడుతుంది. ఉన్నపళంగా కేసులు పెరగడం స్టేజి 3 కి వెళ్ళడంతో ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలు దీన్ని ఏ విధంగా కట్టడి చెయ్యాలి అనే దాని మీద తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 203 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 180 కేసులు నమోదు అయ్యాయి. 

 

గుజరాత్ లో 63 కేసులు, ఢిల్లీలో 72 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర కేరళలో ఇప్పుడు కరోనా కాంటాక్ట్ ద్వారా నమోదు అవుతుంది. ఈ కాంటాక్ట్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీనితో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి వైద్య బృందాన్ని దింపాలి అనే ఆలోచనలో ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని కేంద్రం ఇప్పుడు భావిస్తుంది. అక్కడ మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. 

 

ఆ రెండు రాష్ట్రాల్లో విదేశాలకు వెళ్లి వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. చదువుకునే వాళ్ళు, కార్మికులు ఇలా ఎక్కువగా ఉంటారు. ఇదే ఇప్పుడు అక్కడ ప్రమాదకరంగా మారింది. ఇదే అదుపు చేయలేని విధంగా ఉందీ అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. మరి దీనిని ఏ విధంగా అక్కడి ప్రభుత్వాలు అదుపు చేస్తాయి అనేది చూడాలి. మహారాష్ట్రలో ముంబై, పూణే, నాగపూర్ లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: