ఒకప్పుడు క్రికెట్ మైదానంలో తన బౌలింగ్ తో మంత్రం చేసిన భారత క్రికెట్ అభిమానుల్లో  ఎప్పటికీ గుర్తుండిపోయేలా తనదైన ముద్ర వేశారు. 2007లో టీ20 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో శర్మది కీలకపాత్ర. దాయాది దేశంలో అయిన పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్‌లో ఆఖరి ఓవర్ వేసిన జోగిందర్.. మిస్బా ఉల్ హక్‌ను అవుట్ చేసి భారత్‌కు ప్రపంచకప్ అందించి ‘టీ20 ప్రపంచకప్ హీరో’గా అభిమాల మనసుల్లో నిలిచిపోయాడు. ఇక పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

అలాంటి క్రికెట్ రంగంలో తన బౌలింగ్ తో ఒక్కసారే అందరి చూపు తనవైపు తిప్పుకున్నారు.  అయితే ఇప్పుడు భారత దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిన్న దేశాల నుంచి పెద్ద దేశాల వరకు కరోనా వైరస్ భయం పట్టుకుంది.  ఎక్కడ చూసినా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తుంది.  కోవిడ్-19ను నివారించేందుకు ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో జోగిందర్ మళ్లీ మెరిశాడు. హర్యానా లో జోగిందర్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు.  కరోనా కట్టడికి ఆయన ఎంతో సిన్సియర్ గా తన విధులు నిర్వహిస్తూ.. అందరినీ తనదైన స్టైల్లో డిసిప్లేన్ గా ఉండేలా చేస్తున్నాడు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

బాల్ పట్టుకొని క్రికెట్ మైదానంలోనే కాదు లాఠీ పట్టుకొని సొసైటీలో జోగిందర్ భయపెట్టేశాడు.  జోగిందర్లా లాక్‌డౌన్ సందర్భంగా విధులు నిర్వర్తిస్తూ కనిపించాడు. ఈ ఫొటోను షేర్ చేసిన ఐసీసీ అతడిని ప్రశంసించింది. 2007లో ‘టీ20 ప్రపంచకప్ హీరో’.. 2020లో ‘నిజమైన ప్రపంచ హీరో’ అని కామెంట్ చేసింది. ఐసీసీ పోస్టు చేసిన కాసేపటికే ఈ ఫొటో వైరల్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: