క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్ట‌డంలో భార‌త్ విజ‌య‌వంత‌మైంద‌ని ప్ర‌పంచ దేశాల‌కు ఒక న‌మ్మ‌కం ఏర్ప‌డిన‌ట్లు క‌న‌బ‌డుతోంది. 
అభివృద్ది చెందిన దేశాలైన అమెరికా, ఫ్రాన్స్‌, స్పెయిన్, ఇట‌లీ ఇలా చాలా దేశాలు క‌రోనా బారిన‌ప‌డి క‌కావిక‌ల‌మైన విష‌యం తెలిసిందే. అయితే క‌రోనా ముప్పును కాస్త ఆల‌స్యంగా తెలుసుకున్నా..భార‌త ప్ర‌భుత్వం చేప‌ట్టిన చ‌ర్య‌లు..ప్ర‌జ‌లు స‌హ‌క‌రిస్తున్న తీరును అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు పొగుడుతూ ఆకాశానికెత్తడం గ‌మ‌నార్హం. ఇదే విష‌యాన్ని కేంద్ర మంత్రులు మూడు రోజుల క్రితం నుంచి ప్రెస్‌మీట్ల‌లో ప్ర‌క‌టిస్తూ వ‌స్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదివారం హైద‌రాబాద్‌లో ఉన్న‌తాధికారులతో జ‌రిగిన స‌మీక్ష స‌మావేశం అనంత‌రం విలేఖ‌రుల‌తో మాట్లాడారు. 

 

ఈసంద‌ర్భంగా అంత‌ర్జాతీయ స్థాయిలో భార‌త్‌ను ప్రపంచ‌దేశాలు కొనియాడుతున్నాయ‌ని పేర్కొన్నారు.కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కరోనా వ్యాధిని నియంత్రణ పట్ల 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌ తెలివిగా వ్యవహరించిందని ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. తాను కొన్ని అంతర్జాతీయ పత్రికా కథనాలను చదివినట్లు వివరించారు. లాక్‌డౌన్ కార‌ణంగా కొన్ని తాత్క‌లిక ఇబ్బందులు ఏర్ప‌డ‌వ‌చ్చు. అయితే అలా అమ‌లు చేయ‌డం వ‌ల్లే మ‌నం క‌రోనా మ‌హ‌మ్మారిని నియంత్రించ‌గ‌లిగామంటూ వ్యాఖ్య‌నించారు.

 

 తెలంగాణలో ప్రజలు లాక్‌డౌన్‌కు ఎంతో చక్కగా సహకరిస్తున్నారని.. ఇదే స్ఫూర్తిని మరి కొన్ని రోజులు కొనసాగిద్దామంటూ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఇక‌పై కొత్త‌గా కేసులు న‌మోదు కాకుంటే  ఏప్రిల్ 7 నాటికి తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా అవతరించే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 70 కరోనా పాజిటివ్ కేసుల‌ను గుర్తించాం. అయితే  వీరిలో నెగటివ్ వచ్చిన 11 మంది సోమవారం గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్  చేయ‌నున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో పాజిటివ్ వ‌చ్చినా వైద్యుల చికిత్స‌తో ఒకరు డిశ్చార్జ్ అయిన విష‌యాన్ని గుర్తు చేశారు. మిగిలిన 58 మందిలో ఎవరికీ ప్రమాదమేమీ లేదని చెప్పారు. అయితే.. గండం నుంచి గట్టెక్కినట్లేని ఇప్పుడే  సంబ‌రాలు చేసుకోవ‌ద్ద‌ని హితవు పలికారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: