ప్రపంచమంతా కొరోనా వైరస్ దెబ్బకు వణికిపోతుంటే ఓ దేశాధినేత మాత్రం వైరస్ ను ఏమాత్రం లెక్క చేయటం లేదు. మరి ఏం చేస్తున్నాడు ? ఏం చేస్తున్నాడంటే మిస్సైల్ టెస్టింగ్ తో యమా బిజీగా ఉన్నాడు. అవును మీరు ఊహించింది కరెక్టే. ఆయనే ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్. ఈయన వ్యక్తిత్వతమే విలక్షణంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచంలో బాగా ప్రచారంలో ఉంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ఆదివారం రెండు షార్ట్ రేంజ్ మిస్సైల్స్ ను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఈ ప్రయోగాలను కిమ్ జాంగ్ ఉన్  దగ్గరుండి వ్యక్తిగతంగ పర్యవేక్షించటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే యావత్ ప్రపంచమంతా వైరస్ దెబ్బతో వణికిపోతుంటే ఈయన మాత్రం అసలు వైరస్ గురించే ఆలోచిస్తున్నట్లు లేదు. చూడబోతే వైరస్సే కిమ్ దెబ్బకు వణికిపోతున్నట్లుంది.

 

మిస్సైల్స్  ప్రయోగం విషయంలో దక్షణకొరియా చెబుతున్న అభ్యంతరాలను ఉన్ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. మిస్సైల్ ప్రయోగాలను, అణ్యాయుధాల తయారీపై ఐక్య రాజ్యసమితి భద్రతా మండలినే లెక్క చేయని ఉన్ ఇక దాయాది దేశాన్ని లెక్క చేస్తాడా ? అసలు కొరోనా వైరస్ నియంత్రణకానీ, ఆదేశంలోని రోగుల సంఖ్య, మరణాల వివరాలను  ఇంత వరకూ ఆదేశం ప్రకటించిందే లేదు.  అసలు కొరోనా విషయంలో ఉత్తర కొరియాలో ఏమి జరుగుతోందో కూడా బయట ప్రపంచానికి ఏమాత్రం సమాచారం లేదంటే ఆశ్చర్యంగానే ఉంది.

 

చైనాలో వైరస్ విషయం బయటపడగానే వెంటనే ఆ దేశపు సరిహద్దులను నియంత మూయించేశాడు. అలాగే దక్షిణకొరియాలో కూడా కేసులు బయటపడగానే  ఆ దేశంతో కూడా రాకపోకలను నిలిపేశాడు. అదే సమయంలో దేశంలో జరుగుతున్న విషయాలు బయటప్రపంచానికి తెలీకుండా ఇరన్ కర్టెన్ వేసేశాడు. దాంతో ఉత్తర కొరియాలో ఏం జరిగినా బయటకు తెలీటం లేదు. మరి నియంత  కిమ్ జాంగ్ ఉన్ అంటే మజాకానా ?

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: