ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా భయమే కనిపిస్తోంది. మన ఇండియాను మించిన అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా ధాటికి విలవిల్లాడుతున్నాయి. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో మరణ మృదంగం మోగుతోంది. కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య వేలల్లో ఉంటోంది. అయితే ఈ నేపథ్యంలో మన ఇండియాకు ఓ గుడ్ న్యూస్ చెబుతున్నారు నిపుణులు.

 

 

అదేంటంటే.. ఇండియాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ లో మ్యుటేషన్ లక్షణం కొంత తక్కువగా ఉందట. అంటే కరోనా వైరస్ మనకు అతుక్కునే శాతం అన్నమాట. అందువల్లే ఇండియాలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉందట. అదే విదేశాల్లో అయితే మన ఇండియాలో వ్యాపిస్తున్న వైరస్ తో పోల్చుకుంటే మ్యుటేషన్ శాతం రెండున్నర రెట్లుగా ఉందట. అందువల్లే అక్కడ వేల సంఖ్యలో చనిపోతున్నారని చెబుతున్నారు.

 

 

కొన్ని యూరప్ దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం మ్యుటేషన్ లో ఉన్న తేడాయే అంటున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. ఇండియాలో ప్రవేశించిన కరోనా కు ఒక మ్యుటేషన్ మాత్రమే ఉందని, అది ఇక్కడివారి కణాలను పూర్తిగా అతుక్కోలేకపోవడం వల్ల మరణాలు తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే ఇతర దేశాలలో మూడు మ్యుటేషన్లు చోటు చేసుకున్నాయని ,అందువల్ల ఇటలీ, ప్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలో మరణాలు ఎక్కువంటున్నారాయన.

 

 

ఇప్పటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల మంది ఈ వ్యాధిన పడిన సంగతి తెలిసిందే. విదేశాల్లో కరోనా వచ్చిన వారిలో ఐదు శాతం మరణిస్తున్నారని నాగేశ్వరరెడ్డి చెబుతున్నారు. అదే ఇండియాలో అది రెండు శాతమేనట. అందుకు కారణం ఈ మ్యుటేషన్ లో తేడాయేనట. కరోనా వైరస్ సోకిన వారికి బిపి, సుగర్ వంటి జబ్బులు ఉండడం కూడా మరణాలకు ఒక కారణం అవుతుందని నాగేశ్వరరెడ్డి విశ్లేషిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: