ఇప్పుడు ప్రపంచం మొత్తం ఓ భయంకరమైన వైరస్ పట్టి పీడిస్తుది.  ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని రీతిలో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ దిక్కుమాలిన వైరల్ ప్రపంచంలోని దేశలన్నీ చుట్టేస్తుంది.  ఈ కరోనా వల్ల వందలు కాదు.. వేల సంఖ్యలో మరణాలు సంబవిస్తున్నాయి.. లక్షల్లో ఈ కరోనా భారిన పడుతున్నారు.  ఎటు చూసినా కరోనా హాహా కారాలే వినిపిస్తున్నాయి.  దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.  లాక్ డౌన్ తో ప్రజలు విల విలలాడుతున్నారు.. కానీ వైరస్ ని అరికట్టే ప్రయత్నంలో ఈ తిప్పలు తప్పవంటున్నారు ప్రభుత్వం. 

 

కరోనా ఎఫెక్ట్ ప్రపంచంలో ఏ దేశాల్లో ఎలా ఉంది

 

చైనా :  కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనాలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 45 మందికి కరోనా పాజిటివ్ తేలింది.  మొత్తం మరణాల సంఖ్య 3వేల,3 వందలకు చేరింది. మొత్తం బాధితుల సంఖ్య 81వేల 439 కి చేరింది.  

 

ఇటలీ :  చైనా తర్వాత అంత భయంకరమైన పొజీషన్ లో ఇప్పుడు ఇటలీ ఉంది.  ఇటలీలో 5వేల 217 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాదితుల సంఖ్య 97 వేల 689కి చేరింది. మరోవైపు మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా 10 వేల 779 మంది ఇటలీలో ప్రాణాలు కోల్పోయారు. 

 

స్పెయిన్‌ :   స్పెయిన్‌లోనూ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజే 5వేల, 564 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 78వేల 799కి చేరింది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇటలీ తర్వాత స్పెయిన్‌లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు .

 

అమెరికా : ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ తర్వాత అగ్ర రాజ్యమైన అమెరికా పరిస్థితి దారుణంగా ఉంది.  ఇక్కడ కొత్తగా 7వేల 825 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 31వేల 403కు చేరింది. మరణాలు కూడా 108కి పైగా నమోదయ్యాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం 2వేల 329 మంది కరోనా బాధితులు మృతి చెందారు. 

 

ఫ్రాన్స్‌: కరోనా మహమ్మారి ఇప్పుడు ఇటలీ, స్పెయిన్ తర్వాత ఫ్రాన్స్ లో మారణ హోమం సృష్టించింది.   ఫ్రాన్స్‌లో కూడా పరిస్థితులు దారుణంగానే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు నమోదు కాకపోయినప్పటికీ.. ఇప్పటికే 37వేల 575 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఫ్రాన్స్‌లో మృతుల సంఖ్య 2వేల 314కు చేరింది. 

 

 

ఇరాన్‌  : ఇరాన్‌లోనూ మొత్తం కరోనా కేసులు 38 వేల 309 నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 2వేల 901 మందికి వైరస్‌ సోకింది. ఇక 24 గంటల్లో 123 మంది చనిపోయారు. దీంతో ఇరాన్‌లో మొత్తం మృతుల సంఖ్య 2 వేల 640కి చేరింది.

 

జెర్మనీ : జెర్మనీ కూడా కరోనా వైరస్ ప్రభావంతో వణికిపోతోంది. ఇవాళ ఒక్క రోజులోనే 2వేల 964 మందికి వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 60వేల 659 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 49 మంది చనిపోయారు. జెర్మనీలో ఇప్పటివరకు మొత్తం 482 మంది ప్రాణాలు కోల్పోయారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: