ప్ర‌పంచాన్ని క‌రోనా మ‌హ‌మ్మారి క‌మ్మేస్తోంది. చైనాతో పాటు ఆసియా దేశాలు క‌రోనాను ఇప్ప‌ట‌కీ కూడా కంట్రోల్ చేసే ప‌రిస్థితిలోనే ఉన్నాయి. యూర‌ప్‌లో మాత్రం ప‌రిస్థితి పూర్తిగా అదుపు త‌ప్పేసింది. ఇట‌లీ, జ‌ర్మ‌నీ, స్పెయిన్ దేశాలు విల‌విల్లాడుతున్నాయి. అటు అమెరికాలో కూడా ఘోర‌మైన ప‌రిస్థితి ఉంది. ఇక కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న ఇటలీలోని సిసిలీలో జనం తిండి కోసం సూపర్‌ మార్కెట్లను లూటీ చేస్తున్నారు. ‘మా దగ్గర డబ్బుల్లేవు. కడుపు నింపుకోవాలి కదా’’అంటూ బిల్లు చెల్లించకుండానే పరుగులు తీస్తున్నట్టు స్థానిక పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. 

 

అటు అమెరికాలోనూ సూప‌ర్ మార్కెట్ల‌ను లూటీ చేసే ప‌రిస్థితి వ‌చ్చేసింది. దీంతో పోలీసులు తుపాకులతో మార్కెట్లను పహారా కాయాల్సిన పరిస్థితులు వచ్చేసాయి. ఇట‌లీలో చ‌నిపోయిన వారికి శ‌వపేటిక‌లు కూడా లేక‌పోవ‌డంతో మూకుమ్మ‌డిగా శ‌వాల‌ను గుట్ట‌లు తీసి త‌గ‌ల పెడుతున్నారు. ఇక సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు వ‌ర‌ల్డ్ వైడ్ అప్‌డేట్స్ ఇలా ఉన్నాయి. 

 

ఇండియాలో ఎలా ఉందంటే...
మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు 1024కే చేరుకున్నాయి. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌, కేర‌ళ‌, రాజ‌స్తాన్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కేసులు కాస్త ఎక్కువుగా ఉన్నాయి. అటు ఢిల్లీలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఏప్రిల్ 14 వ‌ర‌కు ఇప్ప‌టికే దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ అమ‌లులో ఉంది. 

 

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 22 , 198

మృతుల సంఖ్య - 33, 976

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,51, 766

యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 36, 454

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 1, 85, 742

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1024

కొత్త కేసులు - ----

మృతులు - 27

తెలంగాణ‌లో కేసులు - 70

తెలంగాణ మృతులు - 1

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 21

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: