కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం తెలుగు రాష్ట్రాలు చెమటోడుస్తున్నాయి. లాక్ డౌన్ నిబంధలు కఠినంగా పాటిస్తున్నాయి. అయితే ఇలాంటి కీలకమైన కష్టమైన సమయంలో అంతా ఒక్కతాటిపై నిలుచుని కరోనా మహమ్మారిపై పోరాడాల్సి ఉంది. కానీ ఈ సమయంలోనూ కొందరు పుల్ల విరుపు మాటలతో.. అసంతృప్తి వ్యాఖ్యలతో పోరాటాన్ని నీరు గారుస్తున్నారు.

 

 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ఏపీ సర్కారుపై చేసిన విమర్శలు ఇలాగే ఉన్నాయి. కరోనా వ్యాప్తి నిరోధంలో గ్రామ వాలంటీర్లు పోషిస్తున్న పాత్రపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం వారిని హోమ్ క్వారంటైన్ కు పరిమితం చేయడం.. వంటి సేవలు దేశంలోనే ఏపీలో చక్కగా జరుగుతున్నాయని జాతీయ స్థాయి మీడియా కూడా మెచ్చుకుంది.

 

 

ఇలాంటి క్లిష్టమైన సమయంలో గ్రామ వాలంటీర్ల సేవలు చాలా కీలకం. వారూ అలాగే పని చేస్తున్నారు. అయితే.. ఈ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అంతా మెచ్చుకుంటుంటే పవన్ కల్యాణ్ మాత్రం విమర్శిస్తున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు తగిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయని పవన్ కల్యాణ్ అంటున్నారు. కొన్ని వేల మంది జనం బయటికి వచ్చి రేషన్ షాపుల ముందు క్యూలో నిలబడుతున్నారు ఇది వాలంటీర్ల వైఫల్యమే అన్నట్టు మాట్లాడుతున్నారు పవన్ కల్యాణ్.

 

 

ప్రతి ఇంటికి రేషన్ సరకులు మేమిస్తామని, నిత్యావసర వస్తువులు అందజేస్తామని వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చిందని... దాని ప్రకారం గ్రామ వాలంటీర్లు తమ బాధ్యతని ఇంకా బాగా నిర్వర్తించి.. జనం రోడ్ల మీదకి రాకుండా చూడాలని పవన్ కల్యాణ్ చెబుతున్నారు. ఇలాంటి కష్టకాలంలో తమ పనిని మరింత బాధ్యతతో కష్టపడి చేస్తారని ఆశిస్తున్నా అని పవన్ కళ్యాణ్ స్పందించడం ఏమాత్రం బాగా లేదనే చెప్పాలి. ఇలాంటి పుల్ల విరుపు మాటలతో వాలంటీర్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడం అవసరమా పవనూ..?

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: