ఏమండి పెద్దలు తిడితే తిట్టారంటారు కానీ.. కరోనా వచ్చి జనమంతా కాకుల్లా అల్లాడుతుంటే.. కొందరు మాత్రం మోహంతో జల్సాలు చేస్తూ, రాక్షసుల్లా మారుతున్నారు.. రానున్న రోజుల్లో బ్రతడం ఎలాగో తెలియక దారులన్ని మూసుకుపోతుంటే.. కామంతో మరికొందరు కన్నుమిన్ను కానరాక ప్రవర్తిస్తున్నారు.. ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెట్టుకుని, చివరికి జీవితాన్ని, పరువును మంటకలుపు కుంటున్నారు.. బ్రతుకంటే భయం ఉన్న వారు ఆలోచనలతో జీవిస్తారు.. బాధ్యత విలువలు తెలియని వాడు బరితెగించి జీవితాన్ని పాడుచేసుకుంటాడు.. ఇదిగో ఇప్పుడు మనం చదవబోయే ఘటనలో మాదిరిగా.. ఇకపోతే  కర్నూలు నగరంలో జరిగిన ఈ దారుణ సంఘటన వివరాలు తెలుసుకుంటే.

 

 

కర్నూలు నగరంలోని వీకర్‌ సెక్షన్‌ కాలనీలో బేల్దారు పని చేస్తున్న ఫరూఖ్‌కు అనే వ్యక్తికి ఫేస్‌బుక్‌లో బెంగళూరుకు చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడగా, ఆ పరిచయం కాస్త హద్దులు దాటి.. అక్రమ సంబంధానికి దారి తీసింది.. అప్పటికే వివాహితగా ఉన్న ఈవిడ ఆరు నెలల క్రితం తన భర్తకు విడాకులిచ్చేసి, మూడేళ్ల కుమారుడితో ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరు కలిసి ఉండాలని నిర్ణయించుకోగా, ఆ వివాహిత కుమారుడితో కలిసి కర్నూలుకు వచ్చి, ఫరూఖ్‌తో సహజీవనం చేస్తోంది. కాగా ఫరూఖ్ ప్రియురాలి కొడుకు జుల్సీ ఆదివారం రాత్రి ఇంట్లో బాగా అల్లరి చేస్తున్నాడు. ఆ అల్లరితో విసుగుచెందిన ఫరూక్‌ బాలుడిని హెచ్చరించాడు.

 

 

అయినప్పటికీ ఆ పిల్లవాడు అల్లరి ఆపకపోవడంతో, విచక్షణ కోల్పోయిన ఫరూఖ్ ఆ కోపంలో బాలుడి తలను గోడకేసి కొట్టడంతో తీవ్ర రక్త స్రావంతో ఆ పసివాడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో అతడిని వెంటనే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆ పిల్లవాడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఇకపోతే బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కర్నూలు ఫోర్త్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.. చూసారా క్షణికమైన ఆవేశం.. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెట్టిందో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: