కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దూకుడుగా అడుగులు వేస్తుంది. కరోనా కాంటాక్ట్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారులను అప్రమత్తం చేసింది. విశాఖ, నెల్లూరు. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కరోనా కాంటాక్ట్ కేసులు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దీనితో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఆదివారం సాయంత్రం రెండు కేసులు బయటపడ్డాయి రాష్ట్రంలో. 

 

దీనితో అనుమానితులను అధికారులు ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు. ఇప్పటికే విదేశీయులను క్వారంటైన్ లో ఉంచింది ప్రభుత్వం. 9 మందిని కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, 10 మందిని విజయవాడ ఆస్పత్రికి తరలించింది. కేసులు ఎక్కడా కూడా పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రాల సరిహద్దులను మూసి వేసింది ఏపీ ప్రభుత్వం. చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసారు. 

 

ప్రకాశం జిల్లాలో కొందరు ఢిల్లీ వెళ్లి మత ప్రార్ధనలలో పాల్గొన్నారు. వారితో కలిసి తిరిగిన వారు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో వారి జాబితాను ప్రకాశం జిల్లా యంత్రాంగ౦ బయటకు తీస్తుంది. ప్రకాశం జిల్లా వాళ్ళతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కొందరు తిరిగారని వాళ్లకు కూడా అనుమానిత లక్షణాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఇక కృష్ణా జిల్లాలో ఉన్న విదేశీయుల విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వాళ్ళలో కొంత మందిని క్వారంటైన్ లో ఉంచగా మరికొంత మందిని గృహ నిర్బంధంలో ఉంచారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: