ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. అది పెడుతున్న భయానికి మనం ఇంట్లో నుంచి బయటకు కూడా అడుగు పెట్టడం లేదు. ఒకవేళ బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బయటకు వెళ్ళినప్పుడు వైరస్ సోకకుండా అనేక మార్గాలను వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే చేతులకు గ్లవ్స్, మూతికి మాస్కులు ధరించినా కూడా కరోనా వైరస్‌ ఏదో ఒకలా సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో కొందరు తమ శరీరమంతా కప్పి ఉంచే వస్త్రాలను ధరిస్తున్నారు.

 

అయితే.. చైనాకు చెందిన ఓ మహిళ జిరాఫీ దుస్తుల్లో హాస్పిటల్‌ కు వెళ్లడం వైరల్‌ గా మారింది. అలాగే ఇటీవల ఓ వ్యక్తి డైనోసార్ బొమ్మలో దూరి రోడ్లపై తిరగడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పుడు తాజాగా యూకేకు చెందిన ఓ మహిళ వాటర్ స్పోర్ట్స్‌కు ఉపయోగించే జార్బ్ బాల్‌ లోకి దూరి షాపింగ్‌ కు వెళ్లింది. ఈ నెల మార్చి 23న కెన్ట్‌ లోని హెర్నేబే ప్రాంతానికి చెందిన మహిళ బుడగలోకి వెళ్లి దాన్ని దొర్లించుకుంటూ రోడ్డు పైకి వెళ్లింది. దింతో అక్కడున్న వారందరు ఆమెను మొదటగా విచిత్రంగా చూశారు.

 

అలాగే.. ఆమె సరుకులు కొనే సూపర్ మార్కెట్ లోకి కూడా ఆ బుడగలో ఉండే ప్రవేశించింది. ఇక అక్కడ ఆమె వెంట వెళ్లిన తన సహాయకుడి సాయంతో అక్కడి వస్తువులను కొనుగోలు చేసింది. ఆమెతో వచ్చిన ఆ సహాయకుడు ఆ బుడగను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాడు. ఆ సహాయకుడు మాట్లాడుతూ.. ఆమె సెల్ఫ్- ఐసోలేటింగ్‌ లో ఉందని, ఆమెకు జెర్మాఫోబిక్.. అంటే బ్యాక్టీరియా, వైరస్‌ లంటే ఎలర్జీ అని తెలిపాడు.

 

ఇక ఆమె స్టోర్ లో అలా తిరుగుతుంటే చాలా మంది కస్టమర్లు ఇబ్బందికి గురయ్యారు. వెంటనే స్టోర్ సిబ్బంది ఆమెను బయటకు వెళ్లాలని కోరారు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: