క‌రోనా క‌రోనా క‌రోనా ఇప్పుడు ఈ పేరు చెపితే చాలు గ‌జ‌గ‌జ వ‌ణికి పోతున్నారు. ఆ దేశం లేదు.. ఈ దేశం లేదు... ప్ర‌పంచంలో ఉన్న ఏ మారుమూల ద్వీపానికి అయినా క‌రోనా వ‌చ్చేస్తుంది. ఇక అమెరికా, ఇట‌లీ, స్పెయిన్ లాంటి దేశాల్లో వైర‌స్ విజృంభిస్తోంది. అమెరికాలో నిన్న ఒక్క రోజే 18 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా 7.22 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇక మృతుల సంఖ్య 33,980 కు చేరుకుంది. 

 

ఇక ఒకే రోజులో స్పెయిన్‌లో 838 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 6,528కి చేరుకుంది. ఇక కేసులు 78,797కి చేరుకున్నాయి.  కరోనా పంజా విసిరిన దేశాల్లో ఇటలీ తర్వాత స్థానం స్పెయిన్‌దే. స్పెయిన్‌ దేశ యువరాణి మేరీ థెరెసా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయసు 86 సంవత్సరాలు. యూరప్‌లో రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారి. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల అప్‌డేట్స్ ఉన్నాయి.  

 

ప్ర‌పంచ వ్యాప్తంగా మొత్తం కేసులు - 7, 22 , 350

మృతుల సంఖ్య - 33, 980

రిక‌వ‌రీ కేసుల సంఖ్య - 1,51, 766

యాక్టివ్ కేసుల సంఖ్య - 5, 36, 604

క్లోజ్‌డ్ కేసుల సంఖ్య - 1, 85, 746

భార‌త్లో పాజిటివ్ కేసుల సంఖ్య - 1024

 

కొత్త కేసులు - ----

మృతులు - 27

తెలంగాణ‌లో కేసులు - 70

తెలంగాణ మృతులు - 1

క్వారంటైన్‌లో ఉన్న వారు - 30 + వేలు

ఏపీలో కేసులు - 21

క్వారంటైన్లో ఉన్న వారు - 30 + వేలు

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: