తెలంగాణాలో కరోనా వైరస్ ని పూర్తి స్థాయిలో తరమడానికి గానూ ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. తెలంగాణాలో క్వారంటైన్ లో ఉన్న వారిలో దాదాపుగా అందరూ కూడా బయటకు వస్తున్నారు. వారిలో కరోనా లక్షణాలు లేకపోవడం తో రాష్ట్ర ప్రభుత్వం వారిని బయటకు పంపిస్తుంది. ఇక హోం క్వారంటైన్ లో ఉన్న వాళ్ళను నిత్యం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

 

కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వారి విషయంలో ఎక్కడిక్కడ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే కింగ్ కోటీలో ఆస్పత్రిని సిద్దం చేసారు. ఇక ఆరు వేల బెడ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేసింది. 22 మెడికల్ కాలేజీలలో ఉన్న ఓపి సేవలను పూర్తిగా ఆపేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ ఉన్న రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణాలను పూర్తిగా ఆపేసింది కెసిఆర్ సర్కార్. 

 

ఇక ఇప్పుడు ఉన్న రోగుల్లో 11 మందికి కరోనా నెగటివ్ వచ్చింది. మరో 58 మంది మాత్రమే కరోనా తో బాధపడుతున్నారు. వీరిలో ఎవరి ఆరోగ్య పరిస్థితి కూడా ఇబ్బందికరంగా లేదని వారు అందరూ కూడా వచ్చే నెల 7 తర్వాత బయటకు వచ్చేస్తారని కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇక క్వారంటైన్ లో ఉన్న వాళ్ళను 5 వేలకు పైగా బృందాలు నిత్యం పర్యవేక్షిస్తున్నాయి. అధికారులు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు. లాక్ డౌన్ ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుంది తెలంగాణా ప్రభుత్వం. ప్రజలు ఎక్కడా కూడా బయటకు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టింది కెసిఆర్ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: