కరోనా దెబ్బకు ఇటలీ ఇంకా దిగజారే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం అక్కడ కరోనా కేసుల సంఖ్య లక్ష వరకు ఉంది. ఈ లక్ష మందిలో వృద్దులు ఎక్కువగా ఉన్నారు. 80 ఏళ్ళకు పైబడిన వారు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారికి అక్కడి ప్రభుత్వం చికిత్స ఆపేసింది. చికిత్స చేసినా లాభం లేదని వారి మీద ఎక్కువగా దృష్టి పెడితే మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. 

 

దాదాపు 40 వేల మంది వరకు 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళు ఉన్నారని వారిలో 22 వేల మంది ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉందని ఇటలీ చెప్తుంది. కొందరి పరిస్థితి కోలుకునే విధంగా ఉన్నా సరే మరికొందరి ఆరోగ్య పరిస్థితి మాత్రం పూర్తిగా క్షీణించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటలీలో ఆదివారం దాదాపు ఏడు వందల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో వెయ్యి మందికి కరోనా వైరస్ సోకింది. 

 

వేగంగా అక్కడ విస్తరించడం ప్రజలను భయపెడుతుంది. ప్రతీ మూడు ఇళ్ళకు ఒకరు కరోనా బాధితుడు ఉన్నాడని ఇది రాబోయే రెండు వారాల్లో ప్రతీ రెండు ఇళ్ళకు ఒకరు కరోనా బాధితుడు ఉండే విధంగా చేస్తుందని ఇప్పుడు గనుక అక్కడి ప్రజలు ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా ఇటలీలో 50 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా ఇటలీ అభివృద్ధి చెందినా సరే పరిస్థితులను అదుపు చేసే సామర్ధ్యం ఆ దేశానికి లేదని అంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: