జ‌న‌సేన పార్టీ అద్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు రాజ‌కీయాలు...అటు సినిమాలు రెండింటినీ విజ‌య‌వంతంగా స‌మ‌న్వ‌యం చేసుకుంటూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన వివిధ అంశాల్లో ప‌వ‌న్ త‌న అభిమానాన్ని చాటుకుంటుంటారు. తాజాగా కీల‌క‌మైన క‌రోనా విష‌యంలోనూ ప‌వ‌న్ త‌న ప్రేమ‌ను పంచుకున్నారు. ఆపత్కాలంలో పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి ధన్యవాదాలు అంటూ ప‌వ‌న్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. `కరోనా మహమ్మారి విజృంభించిన ఆపత్కాలమిది. ఈ సమయంలో ప్రభుత్వానికి... ప్రజలకు... సినీ కార్మిక లోకానికి అండగా నిలిచి పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.` అని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.

 

``క‌రోనా వైర‌స్‌ను కట్టడి చేసేందుకు....లాక్ డౌన్ తరుణంలో ఇక్కట్లలో ఉన్నవారికి బాసటగా నిలిచేందుకు నిధులు చాలా అవసరం. అగ్రశ్రేణి హిందీ కథానాయకుడు అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు ప్రధాన మంత్రికి సహాయ నిధికి భూరి విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సి.సి.సి.) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. కమిటీకి ఛైర్మన్ గా ఉన్న పెద్దన్నయ్య చిరంజీవికి, కమిటీ సభ్యులు డి.సురేశ్ బాబు, ఎన్.శంకర్, సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, బెనర్జీ, తమ్మారెడ్డి భరద్వాజకు అభినందనలు.` అని ప‌వ‌న్ పేర్కొన్నారు. ``సి.సి.సి. కోసం ఇప్పటికే పెద్దన్నయ్య చిరంజీవి రూ.కోటి ప్రకటించారు. నాగార్జున రూ.కోటి, సురేశ్ బాబు, వెంకటేష్, రానా కుటుంబం రూ.కోటి,  ఎన్టీఆర్, మహేశ్ బాబు, నాగచైతన్యలు రూ.25 లక్షల చొప్పున,  రామ్ చరణ్ రూ.30 లక్షలు, వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, సాయి ధర్మతేజ్ రూ.10 లక్షలు, రవితేజ రూ.20 లక్షలు, శర్వానంద్ రూ.15 లక్షలు, విశ్వక్సేన్ రూ.5 లక్షలు,కార్తికేయ రూ.2 లక్షలు, వెన్నెల కిషోర్ రూ.2 లక్షలు, కథానాయిక లావణ్య త్రిపాఠి రూ.లక్ష, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ రూ.10 లక్షలు సి.సి.సి.కి ఇవ్వడం ద్వారా కరోనా విపత్తు వేళ సినీ కార్మికులకు బాసటగా నిలిచారు. సామాజిక బాధ్యతతో నిలిచిన వారందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను.`` అని ప‌వ‌న్ వారిని అభినందించారు.

 

యువ కథానాయకుడు నిఖిల్ తెలంగాణ, ఏపీల్లో ఆసుపతుల్లోని వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, ప్రొటెక్ట్ గ్లాసెస్ లాంటివి ఇవ్వడం అభినంద‌నీయ‌మ‌ని ప‌వ‌న్ కొనియాడారు. వైజయంతి ఫిల్మ్స్ నుంచి అశ్వనీదత్ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.10 లక్షలు, కథానాయకుడు సుధీర్ బాబు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.2 లక్షలు ప్రకటించడం, యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు టీవీ రంగ కార్మికులకు నెల రోజులపాటు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకోవడం  అభినందనీయమ‌ని ప‌వ‌న్ కితాబు ఇచ్చారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: