ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు రోజు రోజుకీ పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది.  మనిషిని మనిషి తాకాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.  అయితే కొన్ని చోట్ల కరోనా సీరియస్ కండీషన్లో ఉన్న పేషంట్ల వరకు డాక్టర్లు సైతం వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెకొంటుంది.  ఏది ఏమైనా ఈ డేంజర్ వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రతి ఒక్కరూ భయపడుతునన నేపథ్యంలో ఇప్పుడు హ్యూమనాయిడ్ రోబోలు రంగంలో దిగబోతున్నాయి. ఐసొలేషన్ కేంద్రాలు, క్వారంటైన్లలో వాటి సేవలను విస్తృతంగా వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 

 

ఇక హ్యూమనాయిడ్ రోబోలు రంగంలోకి దిగితే  హెల్త్ కేర్ వర్కర్లు, నర్సులపై ప్రస్తుతం ఉన్న తీవ్ర ఒత్తిడి నుంచి కాస్తయినా ఉపశమనం లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఇక ఐసొలేషన్ కేంద్రాల్లో ఈ రోబోల సేవలు ఎక్కువగా కొనసాగించాలని చూస్తున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో హ్యూమనాయిడ్ రోబోల సేవలు అందుబాటులోకి తీసుకుని రానున్నారు. కాగా,  ఐసొలేషన్ కేంద్రాల్లో వాటిని వినియోగించుకోవడంపై జిల్లా అధికార యంత్రాంగం ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈ అనుమతి లభించిన వెంటనే వాటి సేవలను అందుబాటులోకి తీసుకుని వస్తామని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు. 

 

తిరుచిరాపల్లికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ ఈ హ్యూమనాయిడ్ రోబోలను రూపొందించింది. ఐసొలేషన్ కేంద్రాల్లో నర్సులు, హెల్త్ కేర్ వర్కర్లకు ప్రత్యామ్నాయంగా పనిచేసేలా ఈ రోబోలను తయారు చేసింది.  ఈ రోబోలు ఎలా పనిచేస్తాయన్న ప్రశ్నకు.. ఏ సమయానికి, ఏ పేషెంట్‌కు, ఏ రకమైన మందులను అందజేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఈ రోబోల్లో ఫీడ్ చేయాల్సి ఉంటుందని, దీనికి అనుగుణంగా అవి పని చేస్తాయని ఆ సాఫ్ట్‌వేర్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: