భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుంది. కరోనా మరణాల సంఖ్య కూడా రోజుకి ఒకటి లేదా రెండు నమోదవుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే పశ్చిమ బెంగాల్ లో కాలింపాంగ్ కి చెందిన ఓ 54 ఏళ్ల మహిళ కరోనా వ్యాధి లక్షణాలతో చనిపోయింది. ఆమె నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారని... దాంతో ఆమెకు చికిత్స చేసిన వైద్యులను, ఆసుపత్రి సిబ్బందిని ఐసోలేషన్ వార్డ్ కి తరలిస్తున్నామని, మృతురాలి కుటుంబ సభ్యులకు కోవిడ్ 19 టెస్టులని చేయనున్నామని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ తెలియజేశారు.


నివేదికల ప్రకారం మృతురాలు థాయిలాండ్ కు వెళ్ళినట్లు... శనివారం రోజు ఆమెకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలినట్లు సమాచారం. కాగా, పశ్చిమ బెంగాల్లో ఈమె మరణంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2 కి చేరుకుంది. మార్చి 23వ తేదీన ఓ 57ఏళ్ల వ్యక్తి కరోనా లక్షణాలతో మరణించాడు. పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 8 కరోనా కేసులు నమోదు కాగా... మొత్తం కేసుల సంఖ్య 47 కి చేరుకుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ సిటీ కి చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి కి కరోనా పాజిటివ్ అని తేలగా... ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా బాధితుల సంఖ్య 39 చేరుకుంది. మహారాష్ట్రలో 12 కొత్త కరోనా కేసులు నమోదు కాగా... మొత్తం బాధితుల సంఖ్య 215 కి చేరుకుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలోని జోధాపూర్ జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. మార్చి 25 వ తేదీన ఇరాన్ దేశం నుండి స్వదేశానికి తిరిగివచ్చిన ఇతను లడఖ్ కి చెందిన వాడని తెలిసింది. ఐతే అతన్ని క్వారంటైన్ లో ఉంచగా... ఈరోజు తన నమూనాలో కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో రాజస్థాన్ రాష్ట్రం మొత్తంలో ఇప్పటివరకు 60 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: