క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19) ప్ర‌స్తుతం ఎంత వేగంగా విస్త‌రిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎవరూ కూడా మాస్క్‌ లేకుండా కాలు బయటపెట్టడం లేదు. ప్రయాణాలు పూర్తిగా మానుకుంటున్నారు. కరోనా వైరస్ అనే కంటికి కనిపించని శత్రువుతో ప్రస్తుతం ప్రపంచమంతా పోరాడుతోంది. ఎంతో అభివృద్ధి దేశాలు సైతం కోవిడ్ దెబ్బకు విలవిల్లాడుతున్నాయి. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. మ‌రోవైపు క‌రోనా బారిన పడి ప్రపంచం అల్లకల్లోలం అవుతోంది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, బంద్‌లు.. ఇలా ఎక్కడ చూసినా పరిస్థితి దారుణంగా తయారైంది.

 

ఇప్ప‌టికే క‌రోనా బారిన ప‌డి 33,976 మంది మృతి చెంద‌గా..  7,22,196 మంది చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే క్షయ వ్యాధి(టీబీ)ని నయం చేసే వందేళ్ల నాటి ఓ వ్యాక్సిన్‌ని ఇప్పుడు ఆస్ట్రేలియా, మెల్‌బోర్న్‌లో, హెల్త్ కేర్ వర్కర్లపై ప్రయోగించారు. వారెవరికి కరోనా వైరస్ సోకలేదు. అయితే ముందు ముందు కూడా క‌రోనా సోక‌కుండా ఈ వ్యాక్సిన్ కాపాడుతుందేయో ట్రైల్స్ వేస్తున్నారు. ఇక వాస్త‌వానికి ఈ వ్యాక్సిన్ బాడీలోకి ఎదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా ఎంటరైనప్పుడు ముందుగా ఇది అడ్డుగోడలా అడ్డుకుంటుంది. దీన్ని వందేళ్ల కిందట బాగా వాడేవాళ్లు. అప్పట్లో ఇది టీబీకి బాగా పనిచేసేది. మ‌రియు  దీంతో బ్లాడర్ కాన్సర్‌ మొదటి దశలో... కామన్ ఇమ్యూనోథెరపీ కింద కూడా ఉప‌యోగ‌ప‌డేది. 

 

టీబీ వ్యాక్సిన్... మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిలా మారుతుంది. అందుకే మొత్తం 4000 మంది హెల్త్ కేర్ వర్కర్లు తమకు తాముగా ఈ ఆరు నెలల ట్రయల్‌లో పాల్గొన్నారు. సోమవారం నుంచి వీళ్లకు వ్యాక్సిన్ ఇచ్చే పని మొదలైంది. వీళ్లను వచ్చే ఆరు నెలలు పరిశీలిస్తారు. కాగా, కరోనా వైరస్ వ్యాపించాక... ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).... ఈ BCG ప్రస్తావన తెచ్చింది. ఇదేమైనా కరోనా వైరస్‌ని చంపుతుందేమో పరిశీలించమని సూచించింది. వెంటనే మెల్‌బోర్న్‌లో అంతర్జాతీయ బృందాలన్నీ ఒక్కటై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించాయి. మ‌రి ఈ వందేళ్ల నాటి టీబీ వ్యాక్సిన్.. క‌రోనాకు చెక్ పెడుతుందో.. లేదో.. చూద్దాం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: