రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా భారతదేశంలో లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విజయవాడలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు, ఆ నగర మునిసిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. కరోనా వైరస్ భారీగా వ్యాపిస్తున్న కారణంగా మంగళవారం నుంచి ఆ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ప్రజలకు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు మాత్రమే రోడ్ల మీదకు అనుమతి ఇస్తామని చెప్పారు.

 

 

లాక్ డౌన్ ముగిసే దాకా పాలు, డెయిరీ ఉత్పత్తులు ఉదయం 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే అందుబాటులో ఉంటాయని వెంకటేష్ వివరించారు. పచారి షాపులు, పండ్ల మార్కెట్, రైతు బజార్లు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరుకు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపారు. ఇక ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు ఏటీఎం ఫిల్లింగ్ వెహికిల్స్‌కు అనుమతి ఇస్తామని, టెక్ అవే హోటల్స్‌కు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు అనుమతి ఉంటుందని మునిసిపల్ కమిషనర్ తెలిపారు.

 

 

ప్రభుత్వ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటీ, రెవిన్యూ, వీయంసీ, మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికల్స్‌కు మాత్రమే అన్ని వేళ్లలో అనుమతి ఉంటుంది. ఇక.. ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా వెహికల్స్‌కు, ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్ వెహికల్స్, మొబైల్ కమ్యునికేషన్స్ వెహికల్స్‌కు ప్రత్యేక అనుమతి ఉంటుందని చెప్పారు. ఆటోనగర్ లో కూడా లాక్ డౌన్ అమలు జరుగుతుందని తెలిపారు. ఇక, ప్రజలు గుంపుగా కనిపించినా, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటే కానీ పరిస్థితి అదుపులోకి రాదనీ, ప్రజలు కూడా అందుకు సహకరించాలని ఆయన కోరారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: