ప్రపంచదేశాలను వణికించేస్తున్న కొరోనా వైరస్ దేశంలో బలహీనపడిందా ? అవుననే అంటున్నా ప్రముఖ  గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్  డాక్టర్ నాగేశ్వరరెడ్డి. వైరస్ చైనాలో పుట్టినపుడు చాలా బలంగా ఉందట. అయితే అక్కడి నుండి ఇటలీ, స్పైన్, ఇరాన్ లాంటి దేశాలకు వెళ్ళినపుడు కూడా వైరస్ అదే బలంతో ఉండేదట. అయితే చాలా దేశాలను చుట్టేసిన తర్వాతే వైరస్ ఇండియాలోకి వచ్చిందట. దాంతో మనదేశంలోకి రాగానే బలహీన పడిపోయిందని డాక్టర్ అంటున్నారు.

 

వూహాన్ లో పుట్టిన వైరస్ కు మనదేశంలోకి ప్రవేశించిన వైరస్ కు చాలా తేడా ఉందంటున్నారు నాగేశ్వరర్ రెడ్డి. వైరస్ బలంగా ఉన్న సమయంలోనే పై దేశాల్లోకి ప్రవేశించటం వల్ల ఆ దేశాల్లో దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉందని అభిప్రాయపడ్డారు. చైనాలో పుట్టినపుడు, పై దేశాల్లోకి ప్రవేశించినపుడు వైరస్ కు ఉన్న మ్యూటేషన్ అంటే కొమ్ములు మనదేశంలోకి వచ్చినపుడు తేడా ఉందట. పై దేశాల్లో ఉన్నపుడు వైరస్ కు మ్యూటేషన్ లేదట. అందుకే చాలా పవర్ ఫుల్ గా ఉంది.

 

అదే మనదేశంలొకి వచ్చేసరికి వైరస్ కు మ్యూటేషన్ వచ్చేసిందట. అంటే కొమ్ములు రావటంతోనే వైరస్ బలహీనపడిందంటున్నారు.  మనం చూస్తున్న వైరస్ కు కొమ్ములున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే డాక్టర్ చెప్పిన ప్రకారం వైరస్ బలహీనపడినపుడే కొమ్ములు వస్తాయట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొమ్ములున్న బలహీనమైన వైరస్ ప్రవేశిస్తేనే మనదేశం అల్లకల్లోలం అయిపోతోంది. అదే  చైనాలో ప్రవేశించినపుడున్న బలమైన వైరస్ మనకు సోకి ఉంటే పరిస్ధితి ఎలాగుండేదో ?

 

ఒక్క మనదేశంలోనే కాదు పై దేశాల్లో చుట్టొచ్చి ఆసియా దేశాల్లోకి ప్రవేశించేనాటికే వైరస్ బలహీనపడి కొమ్ములొచ్చేశాయట. మామూలుగా మనం ఎవరైనా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటే ఏరా కొమ్ములొచ్చాయా అని అంటాము. కానీ ఇవే కొమ్ములు కొరోనా వైరస్ కు రావటం వల్లే బలహీనపడిందని చెప్పటం విచిత్రంగా లేదు.

 

అదే సమయంలో మనదేశం బాగా ఉష్ణదేశం కూడా కావటం వల్ల వైరస్ వ్యాప్తి బాగా స్లోగా ఉందట. చైనా, ఇటలీ, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, స్పైన్ లాంటి దేశాలన్నీ శీతల దేశాలే కాబట్టి వైరస్ స్పీడుగా వ్యాపించిందట. అయితే ఇరాన్ లో కూడా స్పీడుగా ఉండటానికి కారణం అక్కడ ఏసిలు ఎక్కువగా వాడటమేనట. మొత్తానికి మనదేశంలో వైరస్ బలహీనపడిందని చెప్పటం గుడ్ న్యూసే కదా ?

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: