యావత్ భారత దేశం మొత్తం లాక్‌ డౌన్ పాటిస్తుంది. ఈ నేపధ్యంలో పోలీసులు రోజు మొత్తం ఇల్లు వాకిలి వదిలేసి రోడ్లపైనే ఉంటున్నారు. సామాన్య ప్రజల కోసం వారు రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. ఎవ్వరిని రోడ్లపైకి రావొద్దని వస్తె ఏం జరుగుతుందనే విషయాలను చెప్పి వారిని హెచ్చరిస్తున్నారు. కొంత మంది ఇళ్లలో ఉంటున్నా.. మరి కొంతమంది మాత్రం ఆ నిబంధనలను పాటించకుండా స్వేచ్చగా బయటికి వచ్చి తిరగేస్తున్నాను. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం ఎంత చెబుతున్నా ప్రజలు ఎవ్వరూ మాట చెవిన పెట్టుకోవటం లేదు. ఇక దీంతో.. పోలీసులు వారిపై లాఠీ ఛార్జీలు చేస్తున్నారు మరి.


ఇటీవల అమాయక ప్రజలను పోలీసులు కొడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ.. ఇలాంటి ఘటనలు ఒకటి రెండు అలా జరిగి ఉండొచ్చు.. కానీ పోలీసులు పడుతున్న కష్టాలను కూడా ప్రజలు అర్ధం చేసుకోవాలి. ఇల్లు వాకిలి వదిలేసి ప్రజల ఆరోగ్యం, వారి క్షేమం కోసం వారు 24గంటలు పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తే  బాధ్యత ప్రజలపై ఉంది. 24 గంటలు వారు పడుతున్న కష్టాలను ప్రజలు గుర్తించడం లేదనే చెప్పాలి. ఎందుకంటే వాళ్లకు వారి కుటుంబాలు ఉన్నాయి అయినా కూడా వారు మన కోసం వారి ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్నీ అర్ధం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


ఇప్పుడ్డు పోలీసుల పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. పోలీసులు, వారి యొక్క కుటుంబాలు పడుతున్న ఆవేదనకు అద్దం పట్టేలా ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పోలీసు (ఎస్సై స్థాయి) అధికారి తన డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్ళాడు. తర్వాత వారి పిల్లల్ని, భార్యను వేరుగానే ఉంచి భొహణం చేశాడు. వారి తండ్రి ఇంటికి రావడంతో ఇద్దరు పిల్లలు నాన్న అని పిలుస్తూ గేటు దగ్గరే నిలబడి అమాయకంగా చూస్తూ ఉండిపోయారు. ఈ ఫోటోను ఓ వ్యక్తి పోస్ట చేశాడు. ఈ ఫోటోకి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


లాక్ డౌన్ విధించినప్పుడు ఇంట్లో ఉండకుండా బయటికి తిరుగుతున్నారు. సామజిక దూరం పాటించండి అంటే కొందరు చాలా లైట్ తీసుకుంటున్నారు. ఇలా సొంత ఇంట్లోనే కన్నా బిడ్డలకు దూరంగా ఉంటున్నారు పోలీసు అధికారులు, వైద్యాధికారులు. కానీ పోలీసులు మాత్రం రోజంతా బయట తిరుగుతున్నారు. తమ వల్ల వారి కుటుంబానికి ఎక్కడ ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయో అని సొంత ఇంట్లోనే కుటుంబ దూరం పాటించాల్సి వస్తోంది. ఇలాంటివి చూసాకైనా లాక్ డౌన్ నియమాలు పాటించి కరోనా లాంటి మహమ్మారిని అదుపు చేసి తరిమికొడదామని కోరుకుందాం.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: