ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ కరోనాను అరికట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అలానే మన భారతదేశం కూడా కరోనాను అదుపుచేయడానికి లాక్ డౌన్ ప్రకటించి ఆ నిబంధనలను పాటిస్తున్నాయి. అయితే.. ఇలా అందరు ఒకే దగ్గర ఉండటం వలన ఒక రాష్ట్రంలో నేరాలు 30 శాతం పెరిగినట్లు ఈ మధ్య వార్తల్లో వచ్చింది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నేరాలు ఆగిపోయాయి. కరోనా దెబ్బకు బ్రేక్ పడ్డట్టు అయింది. ఇదిలా ఉండగా ఒక భార్యతో ఒక భర్త ఇంట్లో ఉండటం చాలా కష్టతరమైన సమస్య. అలాగే భర్తతో భార్య కూడా అనుకోండి. 

 

ఏపీలో వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తికీ ఇద్దరు భార్యలు లాక్ డౌన్ నేపథ్యంలో ముగ్గురు కలిసి ఒకే ఇంటిలో ఉంటున్నారు. ఇద్దరు భార్యలు ఒక చోట ఉంటేనే ప్రమాదం. అలాంటిది ఇద్దరు ఇంట్లో ఉండగా ఆ వ్యక్తి మద్యం తాగి ఇంటికొస్తున్నాడు. దీంతో వారిరువురు అతన్ని ప్రశ్నించారు. అలా ప్రశ్నించినందుకు ఆ భర్త వారిపై ఆగ్రహం తెచ్చుకుని కత్తితో దాడి చేశాడు. 

 

ఈ సంఘటన విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం గూడెంకాలనీ గ్రామంలో చోటు చేసుకుంది. అసలు పోలీసులు వివరాల ప్రకారం.. వంతల నాగరాజుకు లక్ష్మీ, సుశీల అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆ ఇద్దరు భార్యలు ఒకే గ్రామంలో వేరు వేరు ప్రాంతాలలో నివసిస్తున్నారు. లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అందరం ఒకే దగ్గర ఉందామని నాగరాజు అయన భార్యలతో అన్నాడు. సరే అని కలిసి ఉంటున్నారు. నిన్న ఆదివారం కావటంతో నాటుకోడి వండారు. బయటకు వెళ్లిన భర్తకు రాగానే ప్రేమగా కోడి కూర పెట్టాలని ఆశ పడ్డారు ఆ ఇద్దరు పెళ్ళాలు. 

 

బయటనుంచి ఇంటికి తిరిగి వచ్చిన నాగరాజు మద్యం తాగి ఇంటికి చేరుకున్నాడు. దీనితో ఆ ఇద్దరు ఆగ్రహంతో తాగి వస్తావా అని చెడామడా మాటలు అనేశారు. ఈ మాటలు విన్న నాగరాజు వారిపై కోపం తెచ్చుకుని తిరగబడ్డాడు. కోడిని కట్ చేసే కత్తిని లక్ష్మి కేసి విసిరాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. రక్తస్రావం కావటంతో దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ విషయంపై ఆరా తీసి కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: