కరోనా వైరస్ కారణంగా భారత ప్రభుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అవసరం ఉంటే తప్ప ఇళ్ల నుండి ఎవ్వరనీ బయటకు రావొద్దని ప్రభుత్వం మొత్తుకుంటుంటే, కొంత మంది అస్సలు లెక్క చేయడం లేదు. ఎవరికి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు రోడ్ల పై తిరుగుతున్నారు. దాంతో అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీసులకు సూచించింది. తాజాగా మహారాష్ట్రలోని వడాలా ట్రక్ టెర్మినల్  పోలీసులు లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించినందుకు ముగ్గురిపై కేసు నమోదు చేసారు.

 

 

వివరాల్లోకి వెళ్తే, ఆ ముగ్గురూ వడాలా, అంతోప్ హిల్ ప్రాంతాలకు చెందినవారు. వీళ్ల ముగ్గురూ ఎదో పని మీద బయటకు వచ్చారు. అదే సమయంలో శాంతి నగర్‌లో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ముగ్గురూ పోలీసుల కంటపడ్డారు. ఎందుకు బయట తిరుగుతున్నారని వాళ్ళు ప్రశ్నించగా,  ముగ్గురిలో ఒక వ్యక్తి ఐస్ క్రీం కోసం ఇంటి నుంచి బయటకు రాగా, మరో ఇద్దరు గుట్కా కొనుక్కోవడానికి బయటకు వచ్చామని చెప్పారు. వెంటనే పోలీసులు అవి నిత్యవసరాలు, అత్యవసరాలు కావు కదా? మరి ఎందుకు బయటకు వచ్చారు? రావద్దని ప్రధాని చెప్పారు కదా? ఎందుకొచ్చారు అని వారిని అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వారిపై కేసులు రాశారు.

 

 

ఆ ముగ్గురూ అవసరం లేకున్నా బయట తిరగడమే కాకుండా, మాస్కులు కూడా ధరించలేదని పోలీసులు తెలిపారు. ఐపీసీలోని సెక్షన్ 188, సెక్షన్ 51 కింద ప్రభుత్వ నిబంధనలను పాటింలేదంటూ ఆ మూగురిపై ఈ కేసులను నమోదు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో దేశంలోనే అత్యంధికంగా కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో 193 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది  చనిపోయారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఏ విషయంలోనూ అస్సలు రాజీ పడకూడదని నిర్ణయించుకుంది. పోలీసులు కూడా కాస్త కఠినంగా ఉండాలని, లేకపోతే రాష్ట్రానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: