భారత దేశంలో ఇప్పుడు కరోనా భూతం పట్టి పీడిస్తుంది.  ప్రపంచం మొత్తం ఈ కరోనా భయంతో గజ్జున వణికిపోతున్నారు.  ఎప్పుడు ఎం వార్తలు వినాల్సి వస్తుందో అన్న భయంతో వణికి పోతున్నారు.  కరోనా నేపథ్యంలో మన దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్రాష్ట సరిహద్దుల్లో పూర్తిగా రాకపోకలు ఆపివేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. మరోవైపు కరోనా బాధితుల సంఖ్య ఇండియాలో వెయ్యి దాటిపోగా... మృతుల సంఖ్య 28కు చేరింది. ఇండియాలో నిన్న కొత్తగా 37 కేసులు నమోదయ్యాయి.

 

మొత్తం కేసుల సంఖ్య వెయ్యి 24కు చేరింది. కొత్తగా ముగ్గురు చనిపోవడంతో.. మొత్తం మరణాల సంఖ్య 28కి చేరింది.  ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ గురించి కఠిన చర్యలే తీసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌లు వచ్చాయి.

 

ఇప్పుడు కేసుల సంఖ్య 21కి చేరింది. కాగా ఏపీలో ఇంత వరకు ఒక్క కరోనా బాధితుడు కూడా మృతి చెందలేదు. ఇక తెలంగాణలో కొత్తగా 3 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 70కి చేరింది.  మొత్తంగా తెలంగాణలో కరోనా కారణంగా ఒకరు మాత్రమే చనిపోయారు.  ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకిన వారంతా విదేశాల నుంచి వచ్చినవారు అని అంటున్నారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: