అవును.. అక్కడ కరోనా పీడితుల్ని కాపాడిన డాక్టర్లే.. ప్రాణాలు కోల్పోతున్నారు.. ఈ హృదయ విదారకమైన సంఘటన, ఇటలీలో జరుగుతుండటం ఇపుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇటలీలో ఇప్పటివరకు 97689 కేసులు నమోదు కాగా.. 10779 మంది శ్వాసను విడిచారు. ఇక 13030 మంది రికవర్ అయినట్లు సమాచారం. అత్యధిక మరణాలు.. ఇక్కడే సంభవించడం బాధాకరం.

 

ఇక్కడ, కరోనా పేషెంట్లకు ట్రీట్‌మెంట్ చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది... కరోనా కోరలకు బలైపోతున్నారు. ప్రస్తుతానికి.. 50 మంది వైద్య సిబ్బంది కరోనాతో చనిపోయినట్లు, అక్కడి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ సర్జన్స్ అండ్ డెంటిస్ట్స్ ప్రకటించింది. ప్రెసిడెంట్ ఫిలిప్పో అనెల్లీ మాట్లాడుతూ.. చికిత్స చేసే సమయంలో.. వైద్యులు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడంతోనూ.. సమయ పాలన లేకపోవడంతోను ఈ మరణాలు సంభవించాయని తెలిపారు.

 

భారత్‌లో కరోనా విజ్రంభిస్తున్న వేళ, లాక్‌డౌన్‌ చర్యతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన విధి నిర్వహణలు చేపడుతున్నారు. ప్రపంచ దేశాలలో అత్యధికంగా... అమెరికాలోనే కేసులు నమోదవ్వడం గమనార్హం... 142735 కేసులు ఇక్కడ నమోదవ్వగా, 2488 మంది ప్రాణాలు కోల్పోయారు... ప్రస్తుతం 4562 మంది కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

 

చైనాలోని వూహాన్ లో జన్మించిన కరోనా.. ప్రపంచ దేశాలకు జెట్ స్పీడుతో పయనించి... జనుల ప్రాణాలను కబళిస్తోంది. విశ్వవ్యాప్తంగా... 723345 కేసులు నమోదు అవ్వగా... 33993 మంది చనిపోయారు... ఇప్పటి వరకు... 151809 మంది కోలుకుంటున్నట్లు తెలుస్తోంది... చైనా పరిస్థితి పూర్తిగా... సద్దుమణగగా... అమెరికా, ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్ తదితర దేశాలు... కరోనా కారణంగా అత్యధికంగా నష్టపోతున్నాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: