ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ఇప్పటికే 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్ భారతదేశాన్ని కూడా తాకింది. యావత్ దేశం మొత్తం కూడా కరోనా భయానికి వణికిపోతోంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా లిక్కర్ అమ్మకాలు కూడా నిలిచిపోయాయి. దీని వల్ల దేశ వ్యాప్తంగా మందుబాబులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల మందు బానిసలు ఆత్మహత్యాయత్నాలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో అయితే మందుకు బానిస అయిన వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రోజు రోజుకు ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. ఆందోళన పడిన కేరళ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

 

మందు లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వారిని వెంటనే డీ ఎడిక్షన్ సెంటర్ లో చికిత్స అందించాలని ఆదేశించింది. అదే విధంగా ఫలానా వ్యక్తికి మందు అవసరం అని డాక్టర్ ఛీటీ రాసిస్తే అతనికి మందు సరఫరా చేయాలని కూడా ఎక్సైజ్ శాఖను ఆదేశించారు కేరళ సీఎం విజయన్. దీనికితోడు కొన్ని సంవత్సరాలుగా మద్యం తాగుతూ ఒక్కసారి మానివేయటం వల్ల సామాజిక రుగ్మతలు రోజురోజుకు పెరుగుతున్నాయని.. ఇది సమాజానికి, వారి కుటుంబానికి కూడా మంచిది కాదని అభిప్రాయపడ్డారు సీఎం. ఈ క్రమంలోనే ఆన్ లైన్ ద్వారా మద్యం అమ్మకాలకు ఉన్న అవకాశాలను వెంటనే పరిశీలించాలని కూడా అధికారులను ఆదేశించారు. డాక్టర్ చీటిపై మాత్రం విమర్శలు వస్తున్నాయి.

 

డాక్ట‌ర్ల చిట్టీ కావాలంటూ పేషెంట్ల‌ను ప్రోత్స‌హిస్తే, అది త‌ప్పుడు ప‌ద్ధ‌తుల‌కు దారితీస్తుంద‌ని.. ఆస్పత్రులు, డాక్టర్లపై ఒత్తిడి పెరుగుతుంది అంటున్నారు వైద్యులు. దీంతో ఆన్ లైన్ అమ్మకాల వైపే మొగ్గు చూపిస్తున్నారు. కేరళలో ప్రతి రోజూ 5 లక్షల మంది మద్యం తాగుతారు. వీరిలో 3 లక్షల మంది ఇప్పుడు వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ పరిస్థితి కేవలం కేరళ రాష్టానికే పరిమితం కాలేదు. దేశ వ్యాప్తంగా మందుబాబులు చాలా అవస్థలు పడుతున్నారని సమాచారం. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: