ప్రస్తుతం ప్రపంచంలో సామాన్యుల నుంచి దేశాధ్యక్షుల వరకు ఎవరిని విడిచిపెట్టని అజ్ఞాత శత్రువు కరోనా.. ఇది దొంగ దెబ్బ తీస్తుంది.. ఆధునిక వైద్యశాస్త్రాన్ని పూర్తిగా చదివినట్లుగా ఉంది అందుకే ఎన్ని చిట్కాలు ఉపయోగించిన, ఎన్ని మందులు డోసు పెంచి ఇచ్చినా, రాత్రి పగలు ఆకలిదప్పులు మరచి శ్రమిస్తున్న శాస్ట్రజ్ఞులకు సైతం అందకుండా, దీని రహస్యాన్ని అంతు చిక్కకుండా దాచుకుని, లోకాన్ని శవాల దిబ్బగా మారుస్తుంది..

 

 

ఇప్పటికే ఈ కరోనా చేస్తున్న విద్వంసం వల్ల కొన్ని కొన్ని దేశాలైతే మరో పది సంవత్సరాల వరకు కోలుకోవడం కష్టమే అంటున్నారు ఆర్ధిక నిపుణులు.. ఇక కరోనా ప్రపంచ ఆర్ధిక వ్యవస్దనే కాకుండా, ఎందరినో మట్టిలో కలిపేస్తుండగా, ఈ రోజులను చరిత్రలో పాఠాలుగా చెప్పుకునేలా చేస్తుంది ఈ వైరస్.. ఇకపోతే కరోనా దండయాత్రకు గ్రామీ అవార్డు గ్రహీత, అమెరికాకు చెందిన గాయకుడు జో డిఫ్ఫే బలయ్యాడు. కొవిడ్‌-19 కారణంగా ఆదివారం నాడు జో మరణించాడని ఆయన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ప్రకటించారు. దీనికి రెండు రోజుల క్రితమే తనకు కొవిడ్‌-19 ఉన్నట్లు జో డిఫ్ఫే ప్రకటించాడు..  అప్పటి నుంచి ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని భయం అక్కర్లేదని తెలిపారు. కానీ ఇంతలోనే మృత్యువు ఆయన దరికి చేరింది..

 

 

ఇకపోతే ప్రస్తుతం జో డిఫ్ఫే వయస్సు 61 సంవత్సరాలు. 1990లలో ‘ పికప్‌ మ్యాన్‌’ ప్రాప్‌ మి అప్‌ బిసైడ్‌ ది జ్యూక్‌ బాక్స్‌ వంటి చాలా హిట్‌ సాంగ్స్‌ను ఆయన స్వరపరిచారు.. ప్రస్తుతం జోయ్ డిఫ్ఫీ మృతితో అమెరికాలో విషాద చాయలు అలుము కున్నాయి. ఇక ఇతనే కాకుండా మరో అమెరికన్ సింగర్ జాన్ ఫ్రైన్ కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని, అందుకే ఇతనికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఇక జాన్ వయస్సు కూడా 73 సంవత్సరాలు... కాగా ఇతను బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: