తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా వైరస్ తన ప్రభావం చూపిస్తుంది. ఊహించని విధంగా కరోనా ప్రభావం చూపిస్తుంది. అన్ని దేశాల్లో కూడా కరోనా తీవ్రత ఇప్పుడు ప్రజలను భయపెడుతుంది. అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య లక్షా, 50 వేలు దాటినట్టే కనపడుతుంది. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 1100 దాటడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. 

 

కరోనా ధాటికి స్పెయిన్, జర్మని, అమెరికాలలో పలువురు ప్రముఖులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనితో అక్కడి ప్రజల్లో ఆందోళన మరింతగా వ్యక్తమవుతుంది. కరోనా బాధితుల సంఖ్య... 7 లక్షలు దాటింది. ఇక లక్ష 50 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రజలు ఇళ్ళ నుంచి ఎక్కడా బయటకు రావడం లేదు. కరోనా వైరస్ కేసులను కట్టడి చేయడానికి ఇప్పుడు అన్ని దేశాల ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. 

 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణాలో కేసులు ఏమీ పెరగకపోగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 23 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాకినాడ, రాజమండ్రిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో ప్రజల్లో ఆందోళన మొదలయింది. వీరు అందరూ కూడా మత ప్రార్ధనల కోసం ఢిల్లీ వెళ్లి వచ్చిన వాళ్ళే కావడం గమానార్హం. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు వందల మంది వరకు మత ప్రార్ధనలకు వెళ్ళారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రతకు 34 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, స్పెయిన్ లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని అంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: