కరోనా వైరస్ కంటే పెద్ద శత్రువు ఇపుడు ఎక్కడా లేదు, ఎవరికీ లేదు. ఎందుకంటే కరుణ లేనిది కరోనా. కఠినమైనది కరోనా, కరకు, కిరాతకమైన రూపం కరోనాది. అగ్ర రాజ్యం అమెరికా వంటి దేశాలు కరోనా కాటుకు చిక్కి విలవిలలాడుతున్నాయి. ఇక భారత్ ఏం చేయగలదు, మొత్తం చూస్తే 130 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్నారు. అందుకే కరోనా కూడా వేగంగా అడుగులు వేసుకుంటూ ఇండియా వైపు చూసుకొచ్చింది.

 

అయితే కరోనాకు షాక్ ఇచ్చేలా భారత్ ఉందిపుడు. ఓ విధంగా ప్రమాదం తప్పిందని పూర్తిగా చెప్పలేకపోయినా కూడా కరోనా యూరోపియన్ దేశాలను ఊపేసినంతగా భారత్ లో ఉండబోదని అంటున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నా ముందుగా మెచ్చుకోవాల్సింది భారతీయులనే. 

 

వారి శారీరక ధర్మం,  ఆచార వ్యవహారాలు. ఆహారపు అలవాట్లు. ఎటువంటి క్ర్లిష్టమైన సమస్యనైనా తట్టుకునే శారీరక, మానసిక తత్వం, ఇవన్నీ కలసి కరోనాని భారత్ లో గట్టిగానే ఎదుర్కొంటున్నాయని అంటున్నారు. భారతీయలు సహజంగానే వేడి వాడి గుండెలతో  నిండుగా ఉన్న వారు. కరోనాకు ఇక్కడే అసలైన సమస్య వస్తోంది.

 

అసలు కరోనా సోకిన వారిలో చాలా మంది వేగంగా రికవరీ కావడం వెనక కూడా భారతీయ శారీరక ధర్మమే ప్రధాన పాత్ర పోషిస్తోందిట. అందుకే మరణాల రేటు కూడా పాయింట్  జీరోగా ఇప్పటికైతే ఉంటున్నాయి.

 

ఇక మనలో మరో మంచి సుగుణం ఉంది. కష్టకాలంలో దేశమంతా ఒక్కటి కావడం. రాజకీయాలకు అతీతంగా మేమంతా ఒక్కటే అని స్పందించడం. ఇదే ఇపుడు శ్రీరామ రక్షగా ఉంటోందిట. మరో వైపు ఈ సమయంలో మోడీ లాంటి నాయకుడు దేశానికి ప్రధానిగా ఉండడం
కూడా ఒక అద్రుష్టంగా చెప్పుకోవాలి.

 

మోడీ అంటే జనాలకు ఉన్న అపారమైన విశ్వాసం వల్ల కూడా లాక్ డౌన్ అని చెప్పిన వెంటనే ఏ మాత్రం సందేహించకుండా దేశమంతా ఒక్కటిగా మద్దతు పలికింది. ఈ లాడ్ డౌన్ నిర్ణయాన్ని కూడా దేశంలోని రాష్ట్రాలన్నీ కూడా గట్టిగానే అమలుచేస్తున్నాయి. మరో విషయం ఏంటంటే సరైన టైంలో లాక్ డౌన్ ప్రకటించడం కూడా కలసివచ్చిందిట.

 

మొత్తం మీద చూసుకుంటే భారత్ సంస్కారం. నమస్కారం, మన ఆచారాలు, ఎదుటివారికి చాదస్తాలుగా కనిపించే పద్ధతులు ఇవన్నీ కూడా ఇపుడు అతి పెద్ద దేశాన్ని కరోనా వైరస్ కాటు నుంచి కాపాడుతున్నాయి. మొత్తం మీద భారత్ లో కరోనా వీర విహారం చేయకపోవడం ప్రపంచాన్ని విస్తుపోయేలా  చేస్తోందిట.  

 

ఇప్పటికైతే భారత్ కరోనాను బాగానే అదుపులో ఉంచిందని ప్రపంచ దేశాలు అంటున్నాయి. మరి దాన్ని కొనసాగించి ప్రపంచమే  యావత్తుగా విస్తుపోయేలా కరోనాను దేశం పొలిమేరల నుంచి తరిమేసేంతవరకూ ప్రతీ భారతీయుడు ప్రతిన పూనాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: