చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా నేడు ప్రపంచం అతలాకుతలం అవుతుంది. దాదాపు  199 దేశాలకు పాకిన ఈ వైరస్ 34,000 మంది ప్రాణాలను బలి తీసుకుంది. అలాగే మరో 7 లక్షలకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై వస్తున్న పుకార్లకు కేంద్రం తెరదించింది. ముందు ప్రకటించినట్టుగానే 21 రోజులు మాత్రమే లాక్‌డౌన్‌ ఉంటుందని స్పష్టంచేసింది. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఎలాంటి ప్రణాళికలూ లేవని తెలిపింది.  దేశం మొత్తం కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. 

 

అయితే బయటకు వెళ్లినా.. ఇంట్లో ఉన్న ముఖానికి మాస్క్ లు ధరించాలని అంటున్నారు.  ఇప్పుడు భారత్ లో మాస్కుల కొరత కూడా ఏర్పడుతుందని అంటున్నారు.  ఇదిలా ఉంటే కరోనా సోకకుండా అడవుల్లో ఉండే గిరిజనులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆకులతో సొంతంగా మాస్కూలు తయారుచేసి ముఖాలకు ధరిస్తున్నారు. నాలుగు గంటలపాటు తాజాగా ఉండే ఈ ఆకుల మాస్కులు ధరించి గొత్తికోయలు రోజువారి పనులు చేసుకుంటున్నారు. బ్రేక్ డౌన్ తో గొత్తికోయల జీవనం దీనంగా మారింది.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో ఆదివాసీలు నివసిస్తున్నారు. అడవిలో దొరికే వస్తువులు సేకరించి వారాంతపు సంతలో అమ్ముకుని జీవనం సాగిస్తారు. వీరంతా కరోనా సోకకుండా చెట్ల ఆకుల ద్వారా మాస్కులు తయారుచేసుకుంటున్నారు. ముఖాలకు ఆకుల మాస్కుల ధరించి వైరస్ సోకకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ ఆకుల మాస్క్ నాలుగు గంటలపాటు తాజాగా వుంటుంది. ఇళ్లలోనే వుంటూ తమ పనులు చేసుకంటున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: