క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. రోజురోజుకు శ‌ర‌వేగంగా ప్ర‌పంచ‌దేశాల‌ను క‌మ్మేస్తుంది. ఒక రోజు వ్యవధిలో దాదాపు అన్ని దేశాల్లోనూ కరోనా వైరస్ మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, అమెరికా, ఇరాన్ వంటి దేశాల్లో మరణాల సంఖ్య ప్ర‌జ‌ల‌ను మ‌రింత భయాందోళనలను కలిగిస్తోంది. భారత్ కూడా దీనికి మినహాయింపేమీ కాదు. భార‌త్‌లోనూ క‌రోనా రోజురోజుకు వేగాన్ని పుంజుకుంటుంది.  అన్ని వయసుల వారిపైనా ప్రభావం చూపుతూ ఈ అంటువ్యాధి విస్తరిస్తోంది. 

 

ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే గుమ్మం కదలకుండా ఉండటమేనంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరించాయి. 21 రోజుల పాటు లాక్ డౌన్ ను విధించాయి. నిత్యవసర వస్తువుల కోసం మాత్రం ఉదయంవేళలో కొంత సమయాన్ని సడలించారు. అది కూడా గుంపులుగా కాకుండా ఒకరికి ఒకరు దూరం పాటిస్తూ కొనుగోళ్లు జరపాలని వెల్ల‌డించింది. అయిన‌ప్ప‌టికీ క‌రోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఇండియాలో మ‌రొక‌రు క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. గుజ‌రాత్‌కు చెందిన 45 ఏళ్ల వ్య‌క్తి క‌రోనా వైర‌స్ సోకి చ‌నిపోయాడు. దీంతో ఇండియాలో క‌రోనా మృతుల సంఖ్య 30కి చేరింది.

 

అలాగే నేటి ఉదయానికి దేశంలో కరోనా భాధితుల సంఖ్య 1071 కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ, సంక్షేమ శాఖ వెల్లడించింది. అయితే ఈ వైరస్‌ బారిన పడిన వారిలో.. 100 మంది కోలుకున్నారని తెలిపింది. ఇంకా 942 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది. కాగా మహరాష్ట్రలో దీని తీవ్రత అధికంగా ఉంది, ఇప్పటికే 218 కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయార‌ని వెల్ల‌డించింది. ఇక మ‌హారాష్ట్ర‌తో పాటు పంజాబ్‌, కేర‌ళ‌, రాజ‌స్థాన్‌లో క‌రోనా వైర‌స్ తీవ్ర‌త‌ ఎక్కువ‌గా ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: