ప్రపంచ వ్యాప్తంగా కరోనా విస్తరించింది. అన్ని దేశాలకు ఇప్పుడు కరోనా ప్రభావం ఉంది. 200 పైగా దేశాలు ఇప్పుడు కరోనా వైరస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ప్రతీ గంటా కూడా ఇప్పుడు కీలకంగా మారింది. గంట గంట కు వైరస్ తీవ్రత పెరగడంతో ఇప్పుడు ప్రభుత్వాలను కలవరానికి గురి చేస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ని ప్రకటించాయి చాలా వరకు దేశాలు. 

 

ప్రపంచ వ్యాప్తంగా 35 వేల మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 8 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మన దేశంలో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. మన దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య దాదాపు 1200 వరకు ఉంది. వీరిలో దాదాపు 200 మంది కోలుకున్నారు. 

 

మరికొంత మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోతాజాగా రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలయింది. తెలంగాణాలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. దీనితో అక్కడి ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకున్నా... విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా సోకడం తో ఆందోళన వ్యక్తం చేస్తూ కరోనా మీద యుద్దానికి సిద్దంగా ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: