కరోనా మహమ్మారి కోరలు... మనుషుల శరీరాలను కబళిస్తున్నవేళ... వివిధ శాఖలవారి పని తీరు ప్రశంశనీయం... ముఖ్యంగా వైద్య బృందం, వారి ప్రాణాలను పణంగా పెట్టి, సదరు వైరస్ బాధితులను కోలుకునేలా చేస్తున్నారు... ఈ కోవలోనే... ఇటలీలో అత్యధికంగా 50 మంది డాక్టర్లు ప్రాణ త్యాగం చేసినట్లుగా అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటన విడుదలచేసింది.. డాక్టర్లు దేవుళ్ళగా మారిన వేళ వారికి మనం ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం???

 

ఇకపోతే... అత్యధికంగా ఇటలీలోనే ఇప్పటివరకు 97689 కేసులు నమోదు అవ్వగా.. 10779 మంది అక్కడ మరణించారు... 13030 మంది వ్యాధి బారినుండి బయట పడినట్లు తాజా సమాచారం. అయితే ప్రస్తుత పరిస్థితి కొంత స్టేబుల్ గా వున్నా... అక్కడ జరిగిన నష్టాన్ని ఎవ్వరూ... పూడ్చలేరు. ఇటీవల విడుదల చేసిన ఇటలీ అద్యక్షకుడి కన్నీటి పర్యంతమైన వీడియోని చుసిన ఎవరికైనా.... కళ్ళనుండి కన్నీళ్లు జారక మానవు.

 

మన దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటిస్తున్నవేళ... పలు కాలుష్య నాగరాలైనటువంటి... ఢిల్లీలో మునుపటి కంటే, వాయు కాలుష్య స్థాయిలు తగ్గాయని సమాచారం... అక్కడి గాలిలో సూక్షమైన ధూళి కణాల సంఖ్య తగ్గి, నాణ్యత పెరిగినట్టుగా సమాచారం. అలాగే అహమ్మదాబాద్ మరియు పూణే గాలిలో 15 శాతం వరకు గాలి నాణ్యత పెరిగిందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఇక ముంబై నగరంలో అత్యధికంగా 45 శాతం వరకు కాలుష్యం నివారణ అయింది... ఇక ప్రపంచం మొత్తంగా చూసుకుంటే... కేసుల సంఖ్య క్రింది విధంగా వుంది.

 

ప్రపంచలో మొత్తం కేసులు: 7, 35 , 336
మరణాలు: 34, 818
రికవరీ కేసులు: 1, 56, 137

 

ఇండియాలో మొత్తం కేసులు: 1, 071 
మరణాలు: 29 
కొత్త కేసులు: 47
రికవరీ కేసులు: 100 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 70
మృతులు: 1
ఏపీలో మొత్తం కేసులు: 21
మృతులు: 0

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: