ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే వినిపిస్తుంది.  సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ కరోనా భూతనికి భయపడి పోతున్నారు.  దాయాది దేశం అయిన పాకిస్థాన్ లో ఇప్పటి వరకు కరోనా గురించి పెద్ద సమాచారం లేకున్నా.. ఇప్పుడు అక్కడ కరోనా డేంజర్ బెల్ మోగించిందంట.   కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1600కి చేరింది.  ఇప్పటి వరకు 17 మంది మరణించినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

 

దక్షిణాసియా దేశాల్లోకెల్లా పాకిస్థాన్ లో కరోనా వేగంగా వ్యాప్తిచెందే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. దక్షిణాసియా దేశాలన్నింటిలో పాక్ లోనే ఎక్కువ కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. పాకిస్థాన్ దేశంలో ఫిబ్రవరి 26వతేదీన మొట్టమొదటి కరోనా వైరస్ పాజిటివ్ కేసు బయటపడింది.  పాకిస్థాన్ దేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. పాక్ సింధ్ ప్రాంతంలో కరోనా కేసుల సంఖ్య 469 గా నమోదైంది. పాక్ లో కరోనా వైరస్ రోగుల సంఖ్య ఏరోజుకారోజు పెరుగుతుండటంతో ఆ దేశ వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

 

దక్షిణాసియా దేశాలన్నింటిలో పాక్ లోనే ఎక్కువ కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది. పరిస్థితి ఇలా ఉన్నా గానీ దేశం మొత్తం లాక్ డౌన్ విధించలేదు. పాక్ లోని కొన్ని ప్రాంతాల్లోనే లాక్ డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి.  రోజు రోజు కీ ఈ తీవ్రత మరింత పెరిగిపోతే కరోనా డేంజర్ లీస్ట్ లో పాక్ కూడా ఒకటిగా మారుతుందంటున్నారు. పాకిస్థాన్ లోని అనేక ప్రావిన్స్ ల ప్రభుత్వాలు అక్కడి వాస్తవాలను కప్పిపుచ్చుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 

మరింత సమాచారం తెలుసుకోండి: