కరోనా.. దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కరోనా ప్రభావం వంటనూనెపై కూడా పడింది. గత కొన్ని దశాబ్దాల నుండి ప్రతి సంవత్సరం వంటనూనెకు డిమాండ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కానీ ప్రధాని మోదీ రోజురోజుకు కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేయాలని తీసుకున్న నిర్ణయం ప్రభావం వంటనూనెపై కూడా పడింది. 
 
లాక్ డౌన్ అమలు చేస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా జనాభా పెరుగుతూ ఉండటంతో వంటనూనె వినియోగం కూడా భారీగా పెరిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెను వినియోగించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. జనాభా పెరగడంతో ఆదాయం పెరిగి దేశవ్యాప్తంగా సరికొత్త వంటకాలను వినియోగదారులకు రుచి చూపించే హోటళ్లు, రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి. 
 
మన దేశంలో ఎక్కువగా పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ను ప్రజలు వినియోగిస్తారు. లాక్ డౌన్ ప్రభావంతో గత సంవత్సరంతో పోలిస్తే 23 మిలియన్ టన్నుల డిమాండ్ తగ్గిందని సమాచారం. కొందరు డీలర్లు దేశంలో కనీసం పావు శాతం వంటనూనె వినియోగం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. లాక్ డౌన్ ప్రభావంతో దేశంలోని అన్ని రంగాలు గతంలో ఎన్నడూ లేని విధంగా నష్టాలను చవిచూస్తున్నాయి. 
 
సన్ విన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ 21 రోజుల లాక్ డౌన్ సమయంలో 4,75,000 టన్నుల వంటనూనె డిమాండ్ తగ్గుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. మరోవైపు దేశంలో కరోనా కేసులు 1074కు చేరాయి. కరోనా భారీన పడి 30 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటివరకూ 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: