కరోనా వైరస్ జన జీవితాలను విపరీతంగా ప్రభావితం చేస్తోంది. అనేక రంగాలపై దీని ప్రభావం గణనీయంగా ఉంది. ఇక ఈ కరోనా ఎఫెక్ట్ ప్రింట్ మీడియాపైనా గణనీయంగానే పడింది. పత్రికలు కొనేవారు కరవయ్యారు. అసలు బయటకు వస్తే కదా పత్రికలు కొనడానికి.. ఎప్పుడైనా వచ్చినా పోలీసుల భయానికి ఉప్పో, పప్పో కొనుక్కుని హడావిడిగా ఇంటికి చేరడమే సరిపోతోంది. ఇక పత్రికలు కొనేంత తీరిక ఎక్కడ..?

 

 

ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. అన్ని పత్రికలూ ఉదయం ఆరు గంటలకే డిజిటిల్ మీడియాలో రూపాయి ఖర్చు లేకుండా లభిస్తున్నాయి. ఇంకోభయం ఏంటంటే.. ఈ పత్రికలతో కరోనా వస్తోందన్న ప్రచారమూ ఉంది. ఓ పత్రిక తయారు చేసే సమయంలో ఎన్నో చేతులు మారుతుంది. మరి దీని ద్వారా కరోనా వ్యాపించే అవకాశం లేదని చెప్పలేం. కానీ పత్రికలు మాత్రం అబ్బే మా పత్రికలు కరోనాకు అతీతం.. కరోనా మా పత్రికల ద్వారా రానే రాదని చెబుతున్నాయి.

 

 

అయితే ఆ ప్రచారాన్ని కూడా జనం నమ్మడం లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు మేం పత్రిక తయారీలోనే శానిటైజర్ వాడుతున్నామంటూ వింత ప్రచారం ప్రారంభించారు. అయితే దాన్ని జనం నమ్మడం లేదని కాబోలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓ వింత ప్రయత్నం చేశారు. ఓ ఐదుగురు పిల్లలతో పత్రికలు చదివితే కరోనా రాదు.. పత్రికలతో కరోనా రాదు అని ప్ల కార్డులపై రాయించి ఓ ఫోటో తీసి తన పేపర్లో గొప్పగా రాసుకున్నారు.

 

 

చూశారా పత్రికలతో కరోనా రాదని చిన్న పిల్లలు కూడా చెబుతున్నారని చెప్పుకోవడం కాబోలు. అయితే ఈ పిల్లల ఫోటో మరీ దారుణంగా ఉంది. అంతే కాదు.. ఆ పిల్లలు అంబర్ పేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ప్రచారం కూడా నిర్వహించారట. ఆహా రాధాకృష్ణా.. ఏమీ వినూత్న ఐడియా.. చివరకు చిన్నపిల్లలను కూడా వదలవా.. ఇదే పని మీ సిబ్బందితో చేయిస్తే కాస్త గౌరవంగా ఉండేది కదా..!

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: