కరోనా ధాటికి, ప్రపంచ స్థితి గతులు తల క్రిందులు అయిపోయాయి. ఒకరకంగా ప్రపంచం ఓ పదేళ్లు వెనక్కి వెళ్ళిపోయింది అనడంలో అతిశయోక్తి లేదేమో.. మన దేశం పరిస్థితి అయితే ఇక చెప్పనవసరం లేదు. కరోనా కారణంగా విశ్వ వ్యాప్తంగా తీవ్రమైన ప్రాణ నష్టంతో పాటు... అధికమైన ఆర్ధిక నష్టం వాటిల్లింది. జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే.. కనీసం ఓ దశాబ్దం అయినా పడుతుంది.

 

నిన్న అనగా మార్చ్ 29 2020 నాడు.. జర్మనీలోని 'హెసె' రాష్ట్రము యొక్క ఆర్ధిక మంత్రి, అక్కడి ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో... బలవంతపు మరణానికి పాల్పడిన సంగతి విదితమే. దయనీయమైన ఈ సంఘటన అక్కడి ప్రభుత్వాన్ని, జనులను ఎంతో కలచి వేసింది. అలాగే... ఐరోపాలోని అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా రాణిస్తున్న ఇటలీలో కరోనా కారణంగా.... పరిస్థితి తారుమారు అయ్యింది. అక్కడ తినడానికి తిండి లేక, ఆకలి చావులు చేస్తున్నారు.

 

అయితే, ప్రపంచ ఆర్ధిక స్థితి గతుల్ని అంచనా వేసిన పలువురు ప్రముఖులు భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించి, తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు... జరిగిన నష్టాన్ని వారు సరిపూడ్చలేనప్పటికీ.. ఉడుతా భక్తిగా తమ బాధ్యతను ప్రకటించడం హర్షణీయం... ఇటీవల ఫేస్ బుక్ అధినేత అయినటువంటి... మార్క్ జుకర్ బర్గ్ 187 కోట్ల విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే... ఇక ప్రస్తుతం కరోనా బాధితుల కేసులు, మరణాలు.. క్రింది విధంగా వున్నాయి...

 


ప్రపంచలో మొత్తం కేసులు: 7, 37, 575
మరణాలు: 34, 998
రికవరీ కేసులు: 1,56, 264

 

ఇండియాలో మొత్తం కేసులు: 1071 
మరణాలు: 29 
కొత్త కేసులు: 47
రికవరీ కేసులు: 100 

 

తెలంగాణలో మొత్తం కేసులు: 70
మృతులు: 1
ఏపీలో మొత్తం కేసులు: 21
మృతులు: 0

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: