కరోనా రాకముందు ఎవరైన విదేశాల నుండి వస్తే వారి కుటుంబ సభ్యులు అదొక శుభవార్త అయినట్లుగా ఫోన్లు చేసి అందరికి చెప్పేవారు.. ఇక ఆ వచ్చిన అతన్ని కలవడానికి బంధువులు, స్నేహితులు అందరు వరుసపెట్టేవారు.. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో విదేశాల్లో ఉన్న వారు వచ్చారంటే వారిని అంటరాని వారిగా చూస్తున్నారు.. అతని దగ్గరకు వెళ్లి కలవాలంటే గుండెలు గుభేలుమంటున్నాయి. అంతే కాకుండా మ‌న ప్ర‌మేయం లేకుండానే వారివైపు క‌ళ్లు అనుమానంగా చూస్తున్నాయి. ఇలాంటి స్దితిలో మ‌రి నిజంగానే క‌రోనా సోకిన‌వారి ప‌రిస్థితి ఏంటి? వారికి వైద్య‌ప‌రీక్ష‌లు చేస్తూ నిత్యం వారిని అంటిపెట్టుకునే డాక్ట‌ర్ల ప‌రిస్థితి ఏంటి? అని ఎవరైన ఆలోచిస్తున్నారా..

 

 

అదీగాక కరోనా సోకిన వారికి వైద్యం అందించే వైద్యులే ఆ వైర‌స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. నిజానికి మనం ఇంట్లో ఉండి హాయిగా ఉన్నాం.. కానీ వైద్య సిబ్బంది మాత్రం కంటిమీద కునుకు లేకుండా నిత్యం ప్రమాదంతోనే ప్రయాణం చేస్తున్నారు.. ఇకపోతే ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైన అమెరికాలో ఓ డాక్ట‌ర్ చేసిన మెసేజ్ ప్ర‌స్తుతం విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. న్యూయార్క్‌కు చెందిన మ‌హిళా డాక్ట‌ర్ క‌రోనా వార్డులో సేవ‌లందిస్తోంది. కాగా ఆమె అక్కడి పరిస్దితులను తెలియచేస్తూ ఓ సందేశాన్ని పోస్టు చేసింది.. అదేమంటే నా పిల్ల‌లు చాలా చిన్న‌వారు. వారు ఈ సందేశం చ‌ద‌వ‌లేరు. నేను మెడిక‌ల్ సూట్‌లో ఉన్నందున క‌నీసం న‌న్ను గుర్తుప‌ట్టనూలేరు. ఒక‌వేళ‌ నేను కోవిడ్‌-19 వ‌ల్ల మ‌ర‌ణించాననుకోండి. ఒక్క‌టే నేను కోరుకునేది.. వారి త‌ల్లి బ‌తికున్న‌న్నాళ్లూ ఎంతో క‌ష్ట‌ప‌డి త‌న విధులు నిర్వ‌ర్తించింద‌ని తెలుసుకోవాల‌ని ఆశిస్తున్నానని తన ట్వీట్‌లో పేర్కొంది.

 

 

దీనిపై నెటిజ‌న్లు స్పందిస్తూ ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు. ‘ఇది చ‌దువుతుంటే క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరుగుతున్నాయి’ అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. ఇక ప్రస్తుత పరిస్దితుల్లో చైనా కంటే ఎక్కువగా అమెరికాలో ప‌రిస్థితి రోజురోజుకూ మ‌రింత దిగ‌జారి పోతోంది. కాగా న్యూయార్క్‌లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండ‌టం అక్కడి ప్ర‌జ‌ల‌కే కాకుండా వైద్య సిబ్బందికి కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం అమెరికాలో 59,648 కరోనా కేసులతో న్యూయార్క్‌ మొదటి స్థానంలో నిలవగా, 13 వేల కేసులతో న్యూ జెర్సీ, 6వేలకు పైగా కేసులతో కాలిఫోర్నియా తదుపరి స్థానాల్లో నిలిచాయి. దీన్ని బట్టి అర్ధం చేసుకోండి.. అక్కడ కరోనా ఎంతగా విజృంభిస్తుందో.. ఇలాంటి పరిస్దితుల్లో మన భారతదేశంలోని ప్రజలు అదృష్టవంతులు కానీ ఆ అదృష్టాన్ని అవివేకంతో దూరం చేసుకోకండి.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: