పిల్లలను పెంచడం అనేది ఒక కళ. పిల్లల ప్రవర్తన తల్లి దండ్రులు పెంచే విధానాన్ని బట్టి ఉంటుంది. మనకు ఒక సామెత ఉంది. "మొక్కై వంగనిది మానై వంగునా" అన్న సామెత గుర్తుందనుకుంటా అందరికి. పిల్లలు చిన్నతనం నుంచి నేర్చుకున్నది వాళ్ళ భవిష్యతు నిర్ణయిస్తుంది. చిన్నప్పటి నుంచే పిల్లలను భాద్యతగా పెంచితే వారు సక్రమంగా ఉంటారు. ఈ భాద్యత కేవలం తల్లిదండ్రులదే. చిన్న చిన్న విషయాలకు పిల్లలను కఠినంగా శిక్షించకూడదు. ప్రేమ ఆప్యాయతతో వారికి మాటలతో సర్ది చెప్పి వారి మనసును మార్చటానికి ప్రయత్నం చేయాలి. ఇలా చిన్నప్పటి నుంచి పిల్లలపై తీసుకునే బాధ్యతలు, ప్రేమ, ఆప్యాయత వీటన్నింటిపై పిల్లల భవిష్యత్తు ఆధారపడి పిల్లల జీవిత పునాది ఏర్పడుతుంది.

 

పిల్లల పెంపకం గురించి కొంతమంది పరిశోధకులు కొన్ని విషయాలను వెలువరించారు.

 

చిన్నపిల్లలపై అనుకూల ప్రవర్తన చూపిస్తే పిల్లలు కూడా అలానే ఉంటారు. ప్రతికూల ప్రవర్తనను చుస్తే పిల్లలు బడికి పోయేటప్పుడు వారు గొడవలకు పోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు వారి పిల్లలతో ఆడుతూ, పాడుతూ ఉంటే, ఆ పిల్లలు సమాజంలో మంచి పేరును తెచ్చుకుంటారు. ఎన్నో విజయాలను సాధిస్తారు. తల్లిదండ్రులు కరుణ దయ కలిగి ఉంటె ఒఇల్లాలు కూడా అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ గుణాలు తల్లిదండ్రులకు ఉండటం చాలా అవసరం. పిల్లల పట్ల స్నేహంగా మెలగాలి. సాధారణంగా యవ్వనంగా ఉన్న పిల్లల నుండి వచ్చే సమస్యలు ఎదురుకావని విశ్లేషకులు చెప్తున్నారు. వారి చుట్టూ ఉన్న వాతావరణం ఎంత స్నేహపూర్వకంగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని పరిశోధకులు చెప్తున్నారు. పిల్లలు యుక్త వయస్సు వచ్చాక ఎవ్వరి మాట వినరు. స్వేచ్చగా, స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. వారి విషయాల్లో తల్లితండ్రులు జోక్యం చేసుకోవడం చాలమంది పిల్లలు ఇష్టపడరు. తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహపూర్వకంగా ఉంటే పిల్లలపట్ల విశ్వాసం ఉంటుంది. పిల్లలకు నిద్రకు సంబంధమైన సమస్యలు చిన్నవయస్సులోనే ప్రారంభం అవుతాయి. వారి చిన్నప్పటి జీవితం అస్తవ్యస్తముగా ఉంటే ఇలానే ఉంటారు. కంటినిండా నిద్రపోలేరు. అప్పుడు అలసట, చిరాకు, విసుగు, ఏకాగ్రత లేకపోవడం, చదువులో ముందుండకపోవటం వంటి సమస్యలు వస్తాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లలపట్ల సహనవంతులై ఉండాలి. తల్లితో అనుబంధం గల పిల్లలు అన్ని సమస్యలను ఎదుర్కుంటారు. వారికి ఎటువంటి సమస్య వచ్చినా తల్లి దగ్గరకు వస్తారు. చేదు ప్రభావం వాటి వాటిని అధిగమించగలుగుతారు.  దీని ప్రభావం ఆడపిల్లలకంటే ఎక్కువగా మగ పిల్లల్లో కనిపిస్తుంది. యుక్త వయస్సు గల పిల్లలు తమ కాళ్ళ మీద తాను నిలబడాలంటే తల్లితండ్రుల సహాయ సహకరాలు చాలా అవసరం. ఇటువంటి సహకారాలు తల్లులు చేస్తే మంచి గుర్తింపు సంపాదిస్తారు. మాకు తెలుసు, తాము అనుకున్న విధంగా పిల్లలను పెంచుతాము అనుకుంటే అది పొరపాటు. ముందుగా పిల్లలను బాగా అర్థం చేసుకోవాలి. కఠినంగా ప్రవర్తించే తల్లితండ్రుల పిల్లలకంటే, మృదు స్వభావం కలిగిన వారి పిల్లలకు చింతా, వ్యాకులత, ఆందోళన పరమైన సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెప్తున్నారు. తామ పిల్లలు అన్నివిధాలుగా పరిపూర్ణంగా ఉండాలనుకోవడం, ఒకవైపు పిల్లలకు, మరొక వైపు తల్లితండ్రులకు హింసే. పిల్లలు మంచిగా లేకపోతె సమాజం చిన్నచూవు చూస్తుంది. తల్లి దండ్రుల పంపకంలో లోపం ఉంటే వాటి పరిమాణాలు వారు యొక్క పిల్లలు అనుభవించవలసి ఉంటుంది. కనుక ప్రతీ తల్లిదండ్రులకు పెంపక విధానాల గురించి, వాటి పరిణామాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

 

 

పిల్లల పెంపక విధానాలు- వాటి పరిణామాలు

 

విమర్శలతో పెంచిన బిడ్డ తనను తాను దోషిగా అనుకుంటాడు. పిల్లలను అభినందనతో పెంచితే ఎదుటివారిని గౌరవించి, విలువనివ్వటం నేర్చుకుంటాడు. కోపతాపాలతో పెంచిన బిడ్డ కయ్యాలకు కాలు దువ్వుతాడు. రక్షణాభావంతో పెంచిన బిడ్డ జీవితంపై దృఢమైన నమ్మకం పెంచుకుంటాడు. పిల్లలను సహనంతో పెంచితే క్షమాగుణాన్ని పెంచుకుంటాడు. ప్రోత్సహించి పెంచబడిన బిడ్డ ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతాడు. అవమానంతో పిల్లలను పెంచితే వారు అభద్రతా భావానికి గురవుతారు. పరిహాసాలతో పెంచబడిన బిడ్డ పిరికి వానిగా తయారవుతాడు. స్నేహంతో పెంచిన పిల్లలు ఇతరులకు ప్రేమ భావాన్ని పెంచుతాడు. ఈ పరిణామాలన్నిటిని తెలుసుకుని పిల్లలను ఎలా పెంచాలని నిర్ణయించుకోండి. అలా మంచి బుద్దితో పెంచి పిల్లలకు బంగారు బాట వేయాలని కోరుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి: