ప్రజా ప్రతినిధి అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజలకు ఆదర్శంగా నిలవాలి. అది ఎవరు అయినా సరే ప్రజలకు స్పూర్తిగా నిలవాల్సిన బాధ్యత అతని మీద ఎంతైనా ఉంది. మన దేశంలో కొందరు ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు వేదికగా మారింది. బాధ్యతను మరిచి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు కొందరు. దేశంలో ఇప్పుడు కరోనా తీవ్ర రూపం దాల్చింది. క్రమంగా వైరస్ విస్తరిస్తుంది. ఇది ఇలాగే విస్తరిస్తే మాత్రం పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది వాస్తవం. 

 

ఇప్పుడు బాధ్యతగా ఉండాల్సిన కొందరు ఎమ్మెల్యేలు చికాకుగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణాలో ఒక ఎమ్మెల్యే ఇటీవల అమెరికా వెళ్లి వచ్చి కనీసం క్వారంటైన్ లో ఉండలేదు. ఇష్టం వచ్చినట్టు తిరిగారు ఆయన. ఇక గుంటూరు జిల్లాలో కూడా ఒక ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రవర్తించడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. ఇటీవల ఆయన కుటుంబం ఒక పార్టీ నిర్వహించింది. ఈ పార్టీలో చాలా మంది పాల్గొన్నారు. వారిలో కొంత మందికి కరోనా సోకింది అని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సోదరికి కూడా కరోనా వచ్చింది. 

 

ఇక తాజాగా కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే ఇదే విధంగా ప్రవర్తించడం ఆందోళన కలిగించే అంశం. ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. ఒక పక్క దేశ ప్రజలు అందరూ లాక్ డౌన్ లో ఉంటే జెడిఎస్ ఎమ్మెల్యే ఒకరు తన ఇంటి బయట కుమార్తె కూతురి తో రోడ్డు మీద చార్జింగ్ కారుతో ఆడుకోవడం ఇప్పుడు విమర్శలకు వేదికగా మారింది. బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కనీస విజ్ఞత లేకుండా కొందరు ప్రవర్తిస్తున్నారని ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నలుగురికి చెప్పేలా ఉండాలని ఇలా వద్దని అంటున్నారు.

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: