వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అల్లా కల్లోలం చేస్తుంది. ఇటు సామాన్య ప్రజలే కాదు దేశాధిపతులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇప్పటికే  ప్రపంచ  వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్యా రెట్టింపు అవుతూనే ఉంది. కొన్ని వేల మంది ప్రాణాలను పోగొట్టుకుంటూనే ఉన్నారు. మరి కొంత మంది ఈ వైరస్ బారినపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. 

 


ఇప్పటికే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కోవిడ్ బారిన పడ్డారు. కొన్ని రోజులకు ఆరోగ్య శాఖ మంత్రి కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల కెనడా ప్రధాని కరోనా వైరస్ బారి నుండి కోలుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సలహాదారు రివ్కా పాలౌచ్‌‌కు కూడా కరోనా పాజిటివ్ అని వైద్యులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా పాలౌచ్ ప్రధానితోపాటు ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు, సలహాదారులతో సమయం గడిపాడని మీడియా తెలియజేసింది.

 

పాలౌచ్‌ భర్త ముందుగా కరోనా వైరస్ బారిన పడ్డారు. అనంతరం ఈ వైరస్ ఆయన నుంచి తన భార్యకు సోకడం వలన ఆమె కూడా కరోనా బారిన పడ్డారు. రివ్కా పాలౌచ్‌‌కు పాజిటివ్ అని డాక్టర్స్ తేల్చి చెప్పారు. దింతో ఆయన భార్య నెతన్యాహూ రెండోసారి కరోనావైరస్ పరీక్షలు నిర్వహించుకున్నారు. నెతన్యాహూ‌ను క్వారంటైన్లో ఉంచాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం తెలియజేశారు.

 

ఇప్పటి వరకూ ఇజ్రాయెల్‌లో 4300 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. అది కాకా ఇప్పటికే అక్కడ 16 మంది కరోనా వైరస్ వలన ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడిన వారిలో 80 మంది పరిస్థితి విషమంగా ఉందని తాజాగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ వ్యాధి బారిన పడిన 139 మంది కోలుకున్నారని తెలిపారు. కరోనాను కట్టడి చేయడం కోసం ఇజ్రాయెల్ వ్యాప్తంగా స్కూళ్లను మూసివేశారు. పది మంది కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google:https://tinyurl.com/NIHWNgoogle

apple :https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: