దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే.  అయినా కూడా కొంత మంది చేస్తున్న పొరపాట్ల వల్ల ఈ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా విదేశాల నుంచి వచ్చిన వారికే ఎక్కువగా కరోనా వస్తున్న విషయం తెలిసిందే.  గత కొన్ని రోజులగా దేశంలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా భారత్ లో కరోనా మరణాల సంఖ్య 31కి పెరిగింది. పూణేలో కరోనాతో 52 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. గుజరాత్ లో కరోనాతో ఓ మహిళ మరణించింది.

 

దేశంలోని ఇతర ప్రాంతాల్లో మరో రెండు మరణాలు చోటుచేసుకున్నాయి. అటు పాజిటివ్ కేసుల సంఖ్య 1,100కి చేరువలో ఉంది.  కేరళ రాష్ట్రంలో కొత్తగా మరో 32 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సోమవారం ప్రకటించారు. ఇందులో 17 మంది విదేశాలకు చెందినవారని, మిగిలిన వారు స్థానికులని ఆయన తెలిపారు.  ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 88కి పెరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఏఎం ప్రసాద్ తెలిపారు.

 

ఒక్క గౌతం బుద్ధ నగర్‌లోనే అత్యధికంగా 36 కరోనా కేసులు నమోదయ్యాయని, అలాగే మీరట్‌లో కూడా 13 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు.  కాగా, ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో 175 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే మలేసియా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, కిర్గిజ్ స్థాన్ నుంచి మతప్రచారకులు రాగా, వారితో నిజాముద్దీన్ ప్రాంత వాసులు ఓ మతపరమైన సమావేశంలో పాల్గొన్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: